డిసెంబర్‌లో 2.4 శాతం మూడు నెలల కనిష్టస్థాయి ఇది...
న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ వృద్ధి రేటు 2014 డిసెంబర్‌లో మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. వృద్ధి రేటు ఈ నెలలో 2.4 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, ఎరువులు, స్టీల్ రంగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వృద్ధి రేటు 3 నెలల కనిష్టానికి పడిపోడానికి కారణం.
మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య, పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2013 డిసెంబర్‌లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 4 శాతం. 2014 నవంబర్‌లో 6.7 శాతం. 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్‌లో వేర్వేరుగా ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేట్లు ఇలా...
వృద్ధిలో
⇒ బొగ్గు ఉత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందింది.
⇒ రిఫైనరీ వృద్ధి రేటు 6.1 శాతం వృద్ధి సాధించింది.
⇒ సిమెంట్ రంగం వృద్ధి రేటు 3.8 శాతం పెరిగింది.
⇒ విద్యుత్ రంగం వృద్ధి రేటు 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్‌లో 7.6 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది.
క్షీణతలో...
⇒ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా -1.4 శాతం క్షీణత
⇒ సహజ వాయువు ఉత్పత్తి - 3.5 శాతం క్షీణించింది.
⇒ ఎరువుల రంగం - 1.6 శాతం క్షీణించింది
⇒ స్టీల్ ఉత్పత్తి - 2.4 శాతం పడింది.
9 నెలల్లో స్వల్ప వృద్ధి
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 4.4 శాతానికి ఎగసింది.
‘ఇన్‌ఫ్రా’ ఉత్పాదకత వృద్ధి అంతంతే
Published Tue, Feb 3 2015 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement
Advertisement