
ముంబై: సంబంధిత వర్గాల నమ్మకం చూరగొనేలా, సభ్య దేశాల్లో అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చేలా సురక్షితమైన డిజిటల్ వ్యవస్థాను రూపొందించాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ కూటమి ఒక నివేదికలో పేర్కొంది.
బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండో సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ పలు నివేదికలను ఆవిష్కరించింది. వీటిని బ్రిక్స్ సభ్య దేశాల సెంట్రల్ బ్యాంకులు రూపొందించాయి. బ్రిక్స్ దేశాల్లో డిజిటల్ ఆర్థిక సేవల పరిధి విస్తరణ (డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్–డీఎఫ్‌ఐ) నివేదికను ఆర్‌బీఐ తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. కోవిడ్–19 మహమ్మారి రాకతో డీఎఫ్‌ఐపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం పెరిగిందని నివేదిక వివరించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ సైబర్ దాడులు, ఆన్‌లైన్ మోసాలు వంటి సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల కూటమిని బ్రిక్స్‌గా వ్యవహరిస్తున్నారు.
చదవండి: Cryptocurrency: ఆర్బీఐ ఆందోళన.. నిర్ణయం కేంద్రం పరిధిలో
Comments
Please login to add a commentAdd a comment