బీఎస్‌ఈ ఎండీ సుందరరామన్ రామముర్తి
సింగపూర్: అంతర్జాతీయ సంస్థగా అవతరించేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు బీఎస్‌ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి ప్రకటించారు. గడిచిన 15 నెలల కాలంలో రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా వసతులు, టెలక్నాలజీని మెరుగుపరుచుకున్నట్టు చెప్పారు. ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎఫ్‌ఐఏ) ఆసియా సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
150 ఏళ్ల చరిత్ర కలిగిన బీఎస్‌ఈ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్‌గా తిరిగి తన స్థానాన్ని పొందినట్టు చెప్పారు. వేగంగా వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు లండన్, న్యూయార్క్, ఫ్రాంక్‌ఫర్ట్ తరహాలో వేగవంతమైన ఈక్విటీ మార్కెట్ కూడా అవసరం ఉంటుందన్నారు. పెరుగుతున్న అంతర్జాతీయ, స్థానిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తాము టెక్నాలజీ, వసతులపై పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు.
2022లో రోజువారీ 100 మిలియన్ ఆర్డర్లు నిర్వహిస్తే, ఇప్పుడు రోజువారీ 12 బిలియన్ ఆర్డర్లకు పెరిగినట్టు తెలిపారు. 2023 జనవరి 4న బీఎస్‌ఈ ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టిన రామమూర్తి, దేశంలోనే తొలి స్టాక్ ఎక్సే్ఛంజ్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుండడం గమనార్హం. టైర్ 2, 3, 4 పట్టణాల్లోని యువ ఇన్వెస్టర్లను మొబైల్ యాప్‌ల ద్వారా వేగంగా చేరుకోవచ్చంటూ.. బీఎస్‌ఈ సైతం సిమ్యులేషన్ ఆధారిత యాప్‌ను తీసుకురావడంలో పురోగతిలో ఉన్నట్టు రామమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment