International organization
-
అంతర్జాతీయ సంస్థగా అవతరిస్తాం
సింగపూర్: అంతర్జాతీయ సంస్థగా అవతరించేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి ప్రకటించారు. గడిచిన 15 నెలల కాలంలో రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా వసతులు, టెలక్నాలజీని మెరుగుపరుచుకున్నట్టు చెప్పారు. ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎఫ్ఐఏ) ఆసియా సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన బీఎస్ఈ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్‌గా తిరిగి తన స్థానాన్ని పొందినట్టు చెప్పారు. వేగంగా వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు లండన్, న్యూయార్క్, ఫ్రాంక్ఫర్ట్ తరహాలో వేగవంతమైన ఈక్విటీ మార్కెట్ కూడా అవసరం ఉంటుందన్నారు. పెరుగుతున్న అంతర్జాతీయ, స్థానిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తాము టెక్నాలజీ, వసతులపై పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. 2022లో రోజువారీ 100 మిలియన్ ఆర్డర్లు నిర్వహిస్తే, ఇప్పుడు రోజువారీ 12 బిలియన్ ఆర్డర్లకు పెరిగినట్టు తెలిపారు. 2023 జనవరి 4న బీఎస్ఈ ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టిన రామమూర్తి, దేశంలోనే తొలి స్టాక్ ఎక్సే్ఛంజ్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుండడం గమనార్హం. టైర్ 2, 3, 4 పట్టణాల్లోని యువ ఇన్వెస్టర్లను మొబైల్ యాప్‌ల ద్వారా వేగంగా చేరుకోవచ్చంటూ.. బీఎస్ఈ సైతం సిమ్యులేషన్ ఆధారిత యాప్‌ను తీసుకురావడంలో పురోగతిలో ఉన్నట్టు రామమూర్తి తెలిపారు. -
పెట్టుబడులకు నిలయం.. తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధానాల కోణంలోనే భారత్‌ను చూడొద్దని, తెలంగాణ లాంటి రాష్ట్రాలు భారీ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కలిగి ఉన్నాయని మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఐటీ, ఏరోస్పేస్, జీవ ఔషధాలు, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ ప్రధాన గమ్యస్థానంగా మారడంతో పాటు, అనేక ఫ్రెంచ్ కంపెనీలకు నిలయంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అనేక వినూత్న విధానాలను ప్రవేశపెడుతూ అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఇండో–ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఇఫ్సీ) ఆధ్వర్యంలో జరిగిన నాలుగో విడత ‘ఇండో–ఫ్రెంచ్ పెట్టుబడుల సదస్సు’ లో కేటీఆర్ ప్రసంగించారు. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన భారీ కంపెనీలతో పాటు మధ్యతరహా కంపెనీలను సైతం తెలంగాణకు ఆహ్వానించేం దుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఆవిష్కరణలకు కేంద్రంగా ఉన్న తెలంగాణలో ఫ్రెంచ్ కంపెనీలు పెట్టుబడులతో ముందుకురావడంతో పాటు అనేక అవకాశాలను పొందుతున్నాయ ని ఫ్రెంచ్ రాయబారి ఎమాన్యుయేల్ లెనైన్ అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో టిమ్స్ కోసం ఫ్రెంచ్ తయారీ ఆక్సీజన్ జనరేటర్ ప్లాంట్‌ను ఫ్రాన్స్ అందజేసిన విషయాన్ని ఎమాన్యుయేల్ గుర్తు చేశారు. ఎయిర్పోర్ట్ సామర్థ్యం పెంపు... గత ఏడాది ఫిబ్రవరిలో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్).. ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ గ్రూప్(ఏడీపీ)తో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లో 49శాతం వాటాను పొందినట్లు జీఎంఆర్ డిప్యూటీ సీఈఓ ఆంటోనీ క్రోంబెజ్ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ సామర్థ్యాన్ని 3.4 కోట్ల ప్రయాణిలకు పెంచేందుకు రూ.6,300 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించారు. సదస్సులో ఇఫ్సీ అధ్యక్షుడు సుమిత్ ఆనంద్, డైరెక్టర్ జనరల్ పాయల్ ఎస్ కన్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇండో–ఫ్రెంచ్ పెట్టుబడుల సదస్సులో కేటీఆర్‌తో పాటు భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి ఎమాన్యుయెల్ లెనైన్, వంద మందికి పైగా వివిధ కంపెనీల సీఈలు, చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్లు (సీఎక్స్ఓలు), రాయబారులతో కూడిన ఫ్రెంచ్ పెట్టుబడుదారుల బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్ ప్రతినిధుల బృందంహైదరాబాద్‌లో ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రెంచ్ కంపెనీలు సాఫ్రాన్ ఇంజిన్స్, మానే ఇండియా, సనోఫీ శాంత బయోటెక్‌లను ఫ్రెంచ్ ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో సందర్శించింది. గతంలో ఈ సదస్సులు నాగపూర్ (2018), గోవా (2019), 2020లో కోవిడ్ కారణంగా సదస్సు జరగలేదు. దీంతో ఈ ఏడాది ఆరంభంలో తమిళనాడు (2021)లో జరిగింది. భారత్ ఫ్రెంచ్ నడుమ వాణిజ్య బంధం బలోపేతం చేసేందుకు పురోగమిస్తున్న రాష్ట్రాల్లో ఈ సదస్సులు జరుగుతున్నాయి. -
'రెడ్ కారిడార్' టెర్రర్
న్యూఢిల్లీ: 2016లో భారతదేశంలో జరిగిన దాడుల్లో సగం మరణాలు మావోయిస్టుల హింస వల్లే చోటుచేసుకున్నాయని సిడ్నీకి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ హత్యలన్నీ రెడ్ కారిడార్‌గా పిలిచే ఈశాన్య, మధ్య, దక్షిణ భారతదేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే జరిగాయని పేర్కొంది. 2016లో భారత్‌లో మొత్తం 929 దాడులు జరిగాయని, 340 మంది ప్రాణాలు కోల్పోయారని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఐదో గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్(జీటీఐ) నివేదికలో తెలిపింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఉగ్ర హింస తగ్గుముఖం పడుతున్నా 2016లో 18 శాతం పెరుగుదల నమోదైందని, మృతుల సంఖ్య పెరిగిందని స్పష్టం చేసింది. గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్ నివేదిక ఉగ్ర హింసలో ఇరాక్, అఫ్గానిస్తాన్, నైజీరియా, సిరియా, పాకిస్తాన్, యెమెన్, సోమాలియా, భారత్‌లు మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. 2002 నుంచి భారత్‌లో హింస తగ్గుముఖం పట్టినా 2015తో పోలిస్తే మాత్రం 2016లో దాడులు 16 శాతం పెరగడం గమనార్హం. 2015లో మొత్తం 800 దాడులు చోటుచేసుకోగా 2016లో ఆ సంఖ్య 929కి పెరిగింది. 2015తో పోలిస్తే భారతదేశంలో ఈ దాడుల్లో మరణించినవారి సంఖ్య 18 శాతం పెరిగి 340కి చేరింది. ఇందులో సగం మంది మావోల హింసలో ప్రాణాలు కోల్పోగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హింసలో 30 మంది మరణించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఐదుగురిని బలితీసుకుంది. జాబితాలోని మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలతో పోలిస్తే ఒక్కో దాడిలో మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉంది. భారత్‌లో సగటున ఒక్కో దాడిలో 0.4 మరణాలు చోటుచేసుకోగా మిగతా తొమ్మిది దేశాల్లో అది 2.7గా ఉంది. భారత్‌లో సగానికి పైగా దాడులు పోలీసులు, ప్రైవేటు వ్యక్తులే లక్ష్యంగా జరిగాయి. భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులు ఎక్కువ శాతం ప్రమాదకరం కానివని నివేదిక వెల్లడించింది. ప్రజలు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు కొన్ని గ్రూపులు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయిని, ఇలాంటి దాడులు ఎక్కువగా మావోయిస్టులే చేస్తున్నారని పేర్కొంది. భారత్‌లో హింసకు పాల్పడుతున్న గ్రూపుల్లో ఎక్కువ శాతం రాజకీయ గుర్తింపు కోరుకుంటున్నాయని, అందువల్లే ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా అవి దాడులకు పాల్పడున్నట్లు నిర్ధారించారు. నిజానికి 2016లో భారత్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మూడొంతుల ప్రమాదకరంగా కానివే.. కేవలం 2 శాతం దాడుల్లో మాత్రమే రెండు కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. దేశంలోని మొత్తం 56 గ్రూపుల్లో 20 మాత్రమే ప్రాణహానికి పాల్పడ్డాయని జీటీఐ నివేదిక పేర్కొంది. ఇక ఈశాన్య భారతదేశంలోని తీవ్రవాద గ్రూపుల్లో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ప్రమాదకరమని, 2016లో ఆ ఉగ్రసంస్థ 15 మందిని పొట్టనపెట్టుకుందని, అల్ఫా ఏడుగురుని హత్య చేసిందని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ వెల్లడించింది. ఇక జమ్మూ కశ్మీర్‌పై పాకిస్తాన్‌తో ఉన్న వివాదమే భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయంగా నిషేధం ఉన్నా అవి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించింది. ప్రమాదకర ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని నివేదికలో వెల్లడించారు. -
బిమ్స్టెక్.. ఏడు దేశాల స్నేహ సౌరభం!
ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలలోని ఏడు దేశాలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బిమ్స్టెక్). ఇందులో సభ్య దేశాలుగా బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ ఉన్నాయి. 1997, జూన్6న బ్యాంకాక్‌లో జరిగిన ఒక సమావేశంలో మొదట నాలుగు దేశాలు- బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బిస్టెక్) అనే కూటమిగా ఏర్పడ్డాయి. అదే ఏడాది డిసెంబర్లో కూటమిలో మయన్మార్ అయిదో సభ్య దేశంగా చేరింది. ఆ తర్వాత ఈ కూటమి పేరును బిమ్‌స్టెక్‌గా మార్చారు. 2003లో నేపాల్, భూటాన్‌లు కూటమిలో చేరాయి. 14 రంగాల్లో స్నేహ హస్తం! బిమ్స్టెక్ దేశాలలో 1.3 బిలియన్ ప్రజలు అంటే ప్రపంచ జనాభాలో 21 శాతం మంది నివసిస్తున్నారు. ఈ దేశాలు 14 ప్రాథమ్య రంగాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. అవి.. వాణిజ్యం, పెట్టుబడులు; సాంకేతికత; ఇంధనం; రవాణా, కమ్యూనికేషన్లు; పర్యాటకం; మత్య్స పరిశ్రమ; వ్యవసాయం; సాంస్కృతిక సహకారం; పర్యావరణం-విపత్తుల నిర్వహణ; ప్రజారోగ్యం; ప్రజల మధ్య సంబంధాలు; పేదరిక నిర్మూలన; తీవ్రవాద వ్యతిరేకత; వాతావరణ మార్పులు. మొదటి సదస్సు మయన్మార్‌లో: బిమ్స్టెక్ మొదటి శిఖరాగ్ర సదస్సు 2004లో బ్యాంకాక్‌లో జరగ్గా, రెండో సదస్సును 2008లో ఢిల్లీలో నిర్వహించారు. మూడో శిఖరాగ్ర సదస్సు 2014 మార్చిలో మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగింది. ఈ సమావేశానికి అప్పటి భారత ప్రధాని మన్మోహన్సింగ్ హాజరయ్యారు. ఇందులో సభ్యదేశాలు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణాపై ఉమ్మడిగా పోరాడాలని.. వాణిజ్యం, విద్యుత్తు, పర్యావరణ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి. మూడు ఒప్పందాలు: మూడో సదస్సులో మూడు ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. బిమ్స్టెక్ శాశ్వత సచివాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నెలకొల్పుతారు. 2. భారత్‌లో ‘బిమ్స్టెక్ సెంటర్ ఫర్ వెదర్ అండ్ క్లైమేట్’ ఏర్పాటు చేస్తారు. 3. బిమ్స్టెక్ కల్చరల్ ఇండస్ట్రీస్ కమిషన్, కల్చరల్ ఇండస్ట్రీస్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేస్తారు. నాలుగో శిఖరాగ్ర సదస్సు నేపాల్‌లోని ఖాట్మండ్‌లో జరుగుతుంది. బిమ్స్టెక్ తొలి సెక్రటరీ జనరల్‌గా శ్రీలంకకు చెందిన సుమిత్ నకందలను 2014 మార్చిలో నియమించారు. సభ్యదేశాలు 1. బంగ్లాదేశ్ 2. భారత్ 3. మయన్మార్ 4. శ్రీలంక 5. థాయిలాండ్ 6. భూటాన్ 7. నేపాల్ -
స్విమ్మింగ్ పూల్.. అదుర్స్..
ఎదురుగా ఆల్ప్స్ పర్వతాలు.. మధ్యలో జలపాతం.. ఇంత సుమనోహరమైన దృశ్యాన్ని చూస్తూ.. వెచ్చని ఈతకొలనులో ఎంజాయ్ చేయడమంటే.. సూపర్ కదూ.. ఇంత బాగుంది కాబట్టే హోమ్ లైఫ్ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన ‘ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన స్విమ్మింగ్ పూల్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ ఈతకొలను స్విట్జర్లాండ్‌లోని అడెల్బోడెన్లో ఉన్న కాంబ్రియన్ హోటల్లో ఉంది.