సాక్షి,ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్ర ఏ సందర్భాన్నీ వదులుకోరు. తన బ్రాండ్ ప్రమోషన్ కైనా, తన ఫాలోవర్స్‌లో ఆలోచనలు రేకెత్తించడానికి, లేదా ఎంటర్‌టైన్ చేయడానికైనా ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా గణేశ్ చతుర్థి సందర్భంగా ఒక వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ)
‘గణేష్ చతుర్థి కీ ఏ ఏక్ కహానీ...భారత్ కి ఏక్ కహానీ’ అంటూ ఒక అద్భుతమైన వీడియోను పోస్ట్ చేశారు. వినాయక చవితిపండుగ సందర్భంగా విఘ్ననాయకుడితో దేశంలో సగటు జీవి జీవితం అల్లుకుపోయిన తీరు, ప్రేమ, ఉద్వేగాలు ఈ వీడియోలో చాలా హృద్యంగా మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఇందులో గణేశుడికి కూడా సీట్ బెల్ట్ వేయడం ట్వీపుల్‌ను బాగా ఆకట్టుకుంటోంది. (Vivo Y35: స్లిమ్ ఫోన్ ‘వై35’ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?)
ఈ వీడియోను..సారీ...ఈ యాడ్‌ను లాస్ట్ వరకు చూస్తే మరింత కిక్కు వస్తుంది. ముఖ్యంగా కోవిడ్ తరువాత దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఉత్సాహంగా ఈ ఏడాది గణపతి చతుర్థిని జరుపుకోనున్నారు. పనిలో పనిగా ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన మరో వీడియోను కూడా చూసి తరించండి.
गणेश चतुर्थी की एक कहानी…भारत की एक कहानी… pic.twitter.com/ExXMwsZq9z
— anand mahindra (@anandmahindra) August 31, 2022
He’s unstoppable. May his Force be with you. Have a blessed #GaneshChaturthi pic.twitter.com/fGOFy0VrML
— anand mahindra (@anandmahindra) August 31, 2022
Comments
Please login to add a commentAdd a comment