న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైందన్న వార్తల తదుపరి ఫైజర్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేర్లను విక్రయించారు. తమ హోల్డింగ్స్‌లో 62 శాతానికి సమానమైన 1.76 లక్షల షేర్లను విక్రయించారు. చైర్మన్, సీఈవో ఆల్బర్ట్ బౌర్ల ,32,508 షేర్లు, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ శాలీ 43,662 షేర్లు విక్రయించారు. షేరుకి 41.94 డాలర్ల సగటు ధరలో వీటిని అమ్మివేశారు. ఎస్‌ఈసీకి మంగళవారం ఈ వివరాలను ఇరువురూ వెల్లడించారు. దీంతో బౌర్ల 5.56 మిలియన్ డాలర్లు, శాలీ 1.83 మిలియన్ డాలర్లు ఆర్జించారు. సోమవారం ఫైజర్ వ్యాక్సిన్‌పై అప్‌డేట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరూ ముందుగా ప్రకటించిన ట్రేడింగ్ ప్రణాళిక ప్రకారమే షేర్లను విక్రయించినట్లు బుధవారం కంపెనీ పేర్కొంది. ఎస్‌ఈసీ నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఫైనాన్షియల్ ప్రణాళికలలో భాగంగా వాటాలను అమ్మినట్లు తెలియజేసింది. వ్యాక్సిన్ విజయవంతమైన వార్తలతో సోమవారం ఫైజర్ షేరు ఇంట్రాడేలో దాదాపు 42 డాలర్లకు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment