యునైటెడ్ స్టేట్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే సాధారణ పెట్రోల్, డీజీల్ వాహనాల కంటే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే చైనాలో అయితే కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలంటే మామూలు పెట్రోల్, డీజీల్ వాహనం కంటే చవగ్గా దాదాపు 9 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఇదే అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలకు గుబులు పుట్టిస్తోంది.
ఆటోమోటివ్ పరిశ్రమలో విస్తృతంగా పెరుగుతున్న ధరల అంతరానికి ఇది సంకేతంగా నిలుస్తోంది. యూఎస్, యూరప్, ఇతర ప్రాంతాలలో లెగసీ ఆటోమేకర్లు విక్రయిస్తున్న ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. కానీ చైనాలో సామాన్యులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయగలిగేలా వాటి ధరలు ఉన్నాయి.
చైనాలో సగం ధరకే..
గ్లోబల్ ఆటోమోటివ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జేఏటీవో డైనమిక్స్ (JATO Dynamics) డేటా ప్రకారం.. 2023 ప్రథమార్థంలో సగటు ఈవీ ధర యూరోప్‌లో 66,864 యూరోలు (ప్రస్తుత మారకపు ధరల ప్రకారం రూ.59 లక్షలు), యూఎస్‌లో 68,023 యూరోలు (రూ.60 లక్షలు) . దీనికి విరుద్ధంగా చైనాలో మాత్రం సగటు ఈవీ ధర సగం కంటే తక్కువ అంటే కేవలం 31,165 యూరోలు (రూ.27.5 లక్షలు) ఉంది.
Comments
Please login to add a commentAdd a comment