నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగే కొద్ది కొత్త కొత్త పరిష్కారాలూ పుట్టుకొస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలకు విరుగుడుగా పుట్టుకొచ్చిన సరికొత్త పరిష్కారమే ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు. చూడటానికి ఇది పిల్లలు ఆడుకునే టాయ్ కారులా కనిపించినా, రోడ్లపై సవారీకి భేషుగ్గా పనికొస్తుంది. రద్దీగా ఉండే రహదారుల్లో కాస్తంత చోటు దొరికినా, ఈ కారు సులువుగా ముందుకు సాగగలదు.
చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..!
డెన్మార్క్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ‘సిటీ ట్రాన్స్‌ఫార్మర్’ పేరిట రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు, త్వరలోనే యూరోప్ అంతటా మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే, ఇందులో ఒక్కరు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. స్టార్ట్ చేసిన ఐదు సెకన్లలోనే 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ కారు, గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు.
ఇందులోని బ్యాటరీని అరగంట సేపు చార్జ్ చేసుకుంటే, ఏకధాటిగా 180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారుకు మరో అదనపు సౌకర్యమూ ఉంది. పార్క్ చేసేటప్పుడు దీని ఛెసిస్‌ను మడత పెట్టుకోవచ్చు. దీనివల్ల వంద సెంటీమీటర్ల చోటులోనే దీనిని సునాయాసంగా పార్క్ చేసుకోవచ్చు. అంటే ఒక మామూలు కారును పార్క్ చేయగల స్థలంలో ఇలాంటి నాలుగు కార్లను పార్క్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట!
చదవండి: NASA:చంద్రుడిపై మానవుని అడుగు మరోసారి..! ఎప్పుడంటే..?
Comments
Please login to add a commentAdd a comment