2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ శుభారంభం చేసింది. ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది.
గడచిన ఆరు నెలల్లో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి. బొగ్గు (28.8 శాతం) పెట్రోలియం రిఫైనరీ (9.2 శాతం) విద్యుత్ (10.7 శాతం) రంగాలు మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. సహజ వాయువు ఉత్పత్తి 6.4%, ఎరువుల ఉత్పత్తి 8.7 శాతం, సిమెంట్ ఉత్పత్తి 8% పెరిగింది.
అయితే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 0.9% క్షీణించింది. స్టీల్ ఉత్పత్తి కూడా 0.7 శాతం తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44%. ఏప్రిల్ ఐఐపీ గణాంకాలు రానున్న రెండు వారాల్లో వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment