భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. చిన్న చిన్న కంపెనీలు, స్టార్టప్స్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందంజలో నిలుస్తున్నాయి. తాజాగా మరో స్వదేశీ ఈవీ మేకర్ క్రేయాన్ మోటార్స్ సరికొత్త స్నో+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది.
కేవలం 14 పైసల ఖర్చుతో...
క్రేయాన్ స్నో+ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ స్పీడ్‌తో నడుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 14 పైసల ఖర్చుతో ఒక కిలోమీటర్ మేర ప్రయాణం చేస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. రాబోయే రోజుల్లో 70, 130 కిలోమీటర్ల రేంజ్‌ను ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లను క్రేయాన్ లాంచ్ చేయనుంది.
ఫీచర్స్‌లో సూపర్..!
క్రేయాన్ స్నో+ LED హెడ్‌ల్యాంప్‌తో క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో టర్న్ ఇండికేటర్‌లను ఏకీకృతం చేస్తూ, దిగువన స్కూటర్ అంచున క్రోమ్ గార్నిష్‌తో రానుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో+ డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాకింగ్, మొబైల్ కోసం USB ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్, నావిగేషన్ సౌకర్యం, అదనపు బూట్ స్పేస్ వంటి అనేక అదనపు ఫీచర్లను కల్గి ఉంది. ఇది 150 కిలోల లోడింగ్ కెపాసిటీ సామర్థ్యాన్ని మోయగలదు. ఈ స్కూటర్‌లో 250-వాట్ BLDC మోటార్ 48/60V VRLA/Li-ion బ్యాటరీతో రానుంది. ఇది గరిష్టంగా 25kmph వేగాన్ని కలిగి ఉంది. ఈ స్కూటర్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మొదలైనవి అవసరం లేదు.
ధర ఎంతంటే..?
క్రేయాన్ మోటార్స్ లాంచ్ చేసిన స్నో+ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 64,000(ఎక్స్‌షోరూమ్ ధర)గా ఉంది. స్నో+ఫైరీ రెడ్, సన్‌షైన్ ఎల్లో, క్లాసిక్ గ్రే, సూపర్ వైట్ కలర్ వేరియంట్స్‌లో రానుంది. 2-సంవత్సరాల వారంటీని కంపెనీ అందిస్తోంది. క్రేయాన్ స్నో+ తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఇతర రాష్ట్రాల్లోని 100 రిటైల్ ప్రదేశాలలో అందుబాటులో ఉంది.
చదవండి: సూపర్ ఫీచర్స్, రేంజ్తో మరో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్..! ధర ఎంతంటే...?
Comments
Please login to add a commentAdd a comment