
ముంబై: ఉక్రెయిన్‌పై రష్యా ఎక్కుపెట్టిన రాకెట్ లాంఛర్లు, తుపాకి తుటాల ప్రభావం ఇండియా స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆయిల్ ధరల పెరుగుదలతో ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ద్రవ్యోల్బణం దారి పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా దేశీ స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో చాలా షేర్లు కనిస్ట ధరల దగ్గర లభిస్తున్నాయి. దీంతో దేశీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మొత్తంగా విదేశీ ఇన్వెస్టర్ల షేర్లు దేశీ ఇన్వెస్టర్లకు చేరుతున్నాయి.
అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య కూడా ఈ రోజు మార్కెట్‌లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. రెండు సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 9:15 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 332 పాయింట్లు లాభపడి 57,632 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 17,194 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగుత్ను ట్రెండ్ ఈ రోజు కూడా మార్కెట్‌లో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment