
ముంబై : అనుక్షణం ఉత్కంఠ కలిగించిన మార్కెట్ చివరకు లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లాభానష్టాల మధ్య మార్కెట్ ఊగిసలాడింది. గురువారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 61,259 పాయింట్ల దగ్గర మొదలైంది. ఓ దశలో 61,348 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. వెంటనే పాయింట్లు కోల్పోతూ 60,949 పాయింట్లకు పడిపోయింది. చివరకు 85 పాయింట్ల లాభంతో 61,235 పాయింట్ల దగ్గర మార్కెట్ సెన్సెక్స్ క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 18,257 పాయింట్ల దగ్గర ముగిసింది.
గురువారం మార్కెట్‌లో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలు సత్తా చాటాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ కంపెనీల విలువల 0.65 శాతం పెరగగా స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్ల విలువల 0.61 శాతం పెరిగింది. లార్జ్‌క్యాప్ విభాగంలో జెఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ షేర్లు లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవి చూశాయి.
Comments
Please login to add a commentAdd a comment