
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. దీర్ఘకాలం కొనసాగిన కరెక‌్షన్ వల్ల షేర్ల ధరలు పడిపోవడంతో దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్‌లో జోష్ కనిపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం 9:20 గంటల సమయానికి 331 పాయింట్లు లాభపడి 57,771 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 91 పాయింట్లు లాభపడి 17,177 దగ్గర కొనసాగుతోంది.