
ముంబై: స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా ఆరో రోజు దేశీ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. యూక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల ప్రభావం అమెరికన్ స్టాక్‌మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభం కావడంతోనే అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా మొదటి గంట గడవక ముందే మార్కెట్‌లో నష్టాలు చోటు చేసుకున్నాయి.
ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 519 పాయింట్లు నష్టపోయి 56,972 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈ రోజు తొలి గంటలోనే సెన్సెక్స్ షేర్ల ధరలను 0.90 శాతం క్షీణించాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 201 పాయింట్లు నష్టపోయి 16,948 పాయింట్ల దగ్గర కొనసాగుతూ 1.17 శాతం క్షీణత నమోదు చేసింది. రెండు మార్కెట్లలో స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ అనే తేడా లేకుండా నష్టాలు నమోదు అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment