హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని డేటా సెంటర్స్ 2020 నుంచి రూ.81,247 కోట్ల పెట్టుబడులను అందుకున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది.
‘డేటా వినియోగం పెరుగుతుండడంతో ఇటువంటి కేంద్రాలకు డిమాండ్ అధికం అయింది. పైగా అనేక రాష్ట్రాలు అందించే సబ్సిడీ స్థలం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు మొదలైన ప్రోత్సాహకాలతో డేటా సెంటర్ ఆపరేటర్లు ఉత్సాహంగా ఉన్నారు.
అనుకూలమైన ప్రభుత్వ విధానాలతో గత 2–3 ఏళ్లలో ఈ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రస్తుతం డేటా సెంటర్లు 1.03 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరాయి. 2025 నాటికి ఇది రెండంతలు కానుంది. హైదరాబాద్‌సహా ఏడు ప్రధాన నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యం 770 మెగావాట్లకు చేరుకుంది. దాదాపు సగం డేటా కేంద్రాలు ముంబైలో కొలువుదీరాయి. విజయవాడ వంటి నగరాల్లోనూ ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాన సంస్థలు భావిస్తున్నాయి’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment