న్యూఢిల్లీ : ఎలక్ర్టిక్ వాహనాలపై ప్రజల్లో క్రమంగా డిమాండ్ పెరుగుతున్నా ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారు. రెండేళ్లలో క్రమంగా వీటికి గిరాకీ ఏర్పడనుంది. దాదాపు 2025 నాటికి భారత్‌లో ఎలక్ర్టిక్ కార్ల హవా కొనసాగే అవకాశం ఉందని లూబ్రికెంట్స్ తయారీ సంస్థ క్యాస్ట్రాల్ ఓ నివేదికలో పేర్కొంది. కేవలం 35 నిమిషాల్లోనే కారు చార్జింగ్, ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 401 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం ఉండటంతో ఎలక్ర్టిక్ కార్లపై మోజు ఎక్కువగా ఉంది. కావాల్సిన అన్ని ఫీచర్లు ఉన్నా ధర మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. అంతర్జాతీయంగా వీటి ధర సుమారు రూ. 27 లక్షలుగా ఉంటోంది. దీంతో కారు మెయింటెనెన్స్ ఖర్చులు సైతం భారీగానే ఉండొచ్చనే అనుమానం కూడా ఉంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఎలక్ర్టిక్ వాహనాలకు భారీగానే డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నివేదికలో వెల్లడైంది. దేశీయంగా సుమారు 1,000 మంది పైగా వినియోగదారులు, పరిశ్రమ నిపుణులు క్యాస్ట్రాల్ సర్వేలో పాల్గొన్నారు. (రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్‌కు వాటా!)
Comments
Please login to add a commentAdd a comment