Indias 1st Virtual Influencer Kyra: All You Need To Know About Her In Telugu - Sakshi
Sakshi News home page

Virtual Influencer Kyra Story: వావ్‌ కైరా! ఎందుకమ్మా.. నీకు ఇంతమంది ఫ్యాన్స్‌?

Published Mon, Jun 6 2022 12:27 PM | Last Updated on Mon, Jun 6 2022 1:17 PM

Details About Indias 1st virtual influencer Kyra - Sakshi

ఆమె పేరు కైరా భూమ్మిదికి వచ్చి ఆర్నెళ్లు కూడా కావడం లేదు అప్పుడే ఆమెకు ఇన్‌స్టాలో యాభై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంతటి ఫాలోయింగ్‌ ఉందంటే ఆమె తల్లిదండ్రులెవరో సెలబ్రిటీలు అనుకుని పొరపడకండి. ఆమెకు అసలు తల్లిదండ్రులే లేరు! మరి ఆమెకు ఇంత మంది ఫాలోవర్లు ఎందుకు ఉన్నారని సందేహం వస్తోందా? తప్పకుండా రావాలి మరి. ఎందుకంటే పుట్టుక నుంచి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారే వరకు కైరా ప్రతీ అడుగు ఓ సంచలనమే. 


కైరా పేరుతో ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ 2022 జనవరిలో ఖాతాను ప్రారంభించింది. ఇందులో వర్చువల్‌గా క్రియేట్‌ చేసిన ఓ యువతిని కైరాగా పేర్కొంటూ పోస్టులు చేసింది. ఈ వర్చువల్‌ కైరా మాట్లాడగలదు, డ్యాన్స్‌ చేయగలదు, పాటలు కూడా పాడగలదు. ఒకటేమికి ఆకట్టుకునే రూపంతో రంజిపచేసే కళలు తోడవటంతో జెట్‌ స్పీడ్‌తో ఆమె ఫాలోవర్లు పెరిగిపోయారు. కేవలం ఆర్నెళ్లలోనే యాభై వేలకు మించి ఫాలోవర్లను సాధించింది. ఈ సంఖ్య సెకన్ల ముళ్లుతో పోటీ పడుతూ పరుగులు పెడుతోంది.

ఏంటా స్పీడు
ముగ్గమనోహరమైన కైరా రూపానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కైరా అప్‌డేట్స్‌ కోసం ఫాలోవర్లుగా మారారు. ఆమె నుంచి ఎప్పుడు ఏ అప్‌డేట్‌ వస్తుందా అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్‌ పెరిగి పెరిగి కేవలం ఆరు నెలల్లోనే ఆమె సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్థాయికి చేరుకుంది. ఏదైనా విషయానికి ప్రచారం కల్పించడంతో పాటు  ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసే స్థాయికి కైరా చేరుకుంది.

కైరా వెంట కుర్రకారు
కైరా అందానికి ఇండియన్‌ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. కైరా ఫాలోవర్లలో 90 శాతం మంది భారతీయులు ఉండటమే ఇందుకు ఉదాహారణ. అందులోనూ 18 నుంచి 30 ఏళ్ల వయసులోపు ఉన్న వాళ్లే ఎక్కువ. మళ్లీ ఇందులో అర్బన్‌, మెట్రో యూత్‌ ఎక్కవగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం కైరా అప్‌డేట్స్‌ కోసం అర్రులు చాచి ఎదురు చూస్తున​‍్న వారిలో బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మాదాబాద్‌ వంటి నగరాలకు చెందిన వారే ఉన్నారు. 

ఫస్ట్‌ వర్చువల్‌ 
ఇప్పటి వరకు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌పై ఎంతో మంది సోషల్‌ మీడయా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఎదిగారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు. కానీ దేశంలో తొలిసారిగా ప్రాణం లేని ఓ కల్పిత వర్చువల్‌ మనిషి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్థౠయికి రావడం విశేషం. దీంతో ఇటీవల ఈ వర్చువల్‌  3డీ కైరా రాజస్థాన్‌లోని హవా మహాల్‌ ఎదుట షూట్‌ నిర్వహించారు. ఇందులో వ్యాక్సినేషన్‌ ప్రమోషన్‌ కార్యక్రమాన్ని కైరా చేత చేయించారు.

ఎంతందంగా ఉన్నావే
కైరాకు పెరిగిన క్రేజ్‌ను చూసి టెక్నాలజీ, ఫ్యాషన్‌, గ్యాడ్జెట్‌ సెకార్ట్ల నుంచి తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయాలంటూ ఆర్జీలు పెరిగిపోతున్నాయట, మరోవైపు రోజురోజుకి కైరాకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోతుంది. వర్చువల్‌ అని తెలిసి కొందరు తెలియక మరికొందరు నీ అందానికి సీక్రెట్స్‌ ఏంటి అంటూ కైరా వెంటపడుతున్నారు. మరీ ఈ క్రేజ్‌ చివరకు ఏ ఎత్తులకు చేరుకుంటుందో? ఏ మలుపు తీసుకుంటుందో చూడాలంటే మరికొంతవ కాలం వేచి చూడాల్సిందే!

చదవండి: అదిరిపోయే ఆఫర్‌.. జాబ్‌ వదిలేస్తే లక్ష డాలర్లు ఇస్తాం! ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement