కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. ఈయన దగ్గర ఉన్న మొత్తం విలువ రూ. 20.4 కోట్లుగా పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు.. జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు ఉన్నట్లు ఉన్నట్లు తెలిపారు. ఈయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు గత పదేళ్లలో మంచి వృద్ధిని పొందాయి.
రాహుల్ గాంధీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు & పదేళ్లలో ఆ సంస్థల వృద్ధి
- ఆల్కైల్ అమీన్స్ కెమికల్స్ లిమిటెడ్: +3625.00 శాతం
- ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్: +467.38 శాతం
- బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్: +4028.06 శాతం
- దీపక్ నైట్రేట్ లిమిటెడ్: +3510.21 శాతం
- దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: +443.78 శాతం
- డా. లాల్ పాత్‌లాబ్స్ లిమిటెడ్: +215.04 శాతం
- ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: 434.64 శాతం
- గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్: +3454.00 శాతం
- జీఎంఎం Pfaudler లిమిటెడ్: +469.09 శాతం
- హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్: +291.49 శాతం
- ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్: +363.68 శాతం
- ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్: +868.50 శాతం
- ఇన్ఫోసిస్ లిమిటెడ్: +275.39 శాతం
- ఐటీసీ లిమిటెడ్: +78.80 శాతం
- ఎల్‌టీఐ మైండ్‌ట్రీ లిమిటెడ్: +636.42 శాతం
- మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్: +595.35 శాతం
- నెస్లే ఇండియా లిమిటెడ్: +434.42 శాతం
- పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: +816.51 శాతం
- సుప్రజిత్ ఇంజినీరింగ్ లిమిటెడ్: +475.14 శాతం
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్: +263.04 శాతం
- టైటాన్ కంపెనీ లిమిటెడ్: +1123.42 శాతం
- ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్: +1226.25 శాతం
- వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్: +1276.81 శాతం
- వినైల్ కెమికల్స్ (ఇండియా) లిమిటెడ్: +2101.45 శాతం
- బ్రిటానియా ఇండస్ట్రీస్: +1007.61 శాతం
Comments
Please login to add a commentAdd a comment