బంగారం ధర రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో మంగళవారం 10గ్రాముల బంగారం రూ.52వేల స్థాయిని అధిగమించింది. అటు అంతర్జాతీయంగానూ తొలిసారి ఔన్స్ బంగారం 2000డాలర్లను అందుకుంది. అలాగే కేజీ వెండి ధర కూడా రూ.67,000లను చేరుకుంది. నేడు ఎంసీఎక్స్‌లో ఉదయం 10:15ని.లకు 10గ్రాముల బంగారం ధర రూ.200ల లాభంతో రూ.52301 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి రూ.1066 లాభంతో రూ.52,101 వద్ద స్థిరపడింది. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా కేవలం 2రెండు రోజుల్లో రూ.1500 పెరగడం విశేషం.
రూ.52వేలపైకి ఎందుకంటే: అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 2000డాలర్ల స్థాయిని అందుకోవడం, కోవిడ్-19 కేసుల పెరుగుదల, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం, రానున్న రోజుల్లో పెళ్లిళ్లు, పండుగల సీజన్‌తో డిమాండ్ పెరగడం తదితర అంశాలు దేశీయంగా బంగారం ధరను రూ.52వేల స్థాయిని అధిగమించేందుకు దోహదపడినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా 2000 డాలర్ల పైకి: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశం నేడు ప్రారంభం కానుంది. ఈసారి కూడా ఫెడ్ వడ్డీరేట్లపై మెతక వైఖరి ప్రదర్శించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సులభతరమైన వడ్డీరేట్లు బంగారం ర్యాలీకి తోడ్పాటునిస్తాయి. అలాగే అమెరికా చైనాల మధ్య వాణిజ్య వివాదాలు ముదరడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ 2ఏళ్ల కనిష్టాన్ని పతనమైంది. వ్యవస్థలో కోవిడ్ ఏర్పరిచిన సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు ఆయా దేశాలు ప్యాకేజీలను ప్రకటించాయి. ఈ కారణాలతో బంగారాన్ని 2000డాలర్ల స్థాయిని అధిగమించేందుకు దోహదపడినట్లు బులియన్ పండితులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment