అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) డెన్మార్క్‌లోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే నిజమైతే.. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని న్యూయార్క్ ఫెడ్‌లో రియల్ ఎస్టేట్ డెవలపర్ & మాజీ ఆర్థికవేత్త 'డేవిడ్ బార్కర్' (David Barker) ఓ అంచనా వేశారు.
గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలంటే 12.5 బిలియన్ డాలర్ల నుంచి 77 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని బార్కర్ వెల్లడించారు. అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.1 లక్ష కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ట్రంప్‌కు కొత్తేమీ కాదు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కూడా 1946లో ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ ఈ భూభాగాన్ని 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ దీన్ని డెన్మార్క్ తిరస్కరించింది.
ఇదీ చదవండి: పాకిస్తాన్‌లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..
అమెరికా విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఫ్రాన్స్ నుంచి లూసియానా, డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐలాండ్స్, రష్యా నుంచి అలస్కా వంటి భూభాగాలను యూఎస్ఏ కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడం అనేది అంత సులభమైన పనేమీ కాదు. అంతే కాకుండా అక్కడి ప్రధాన మంత్రి 'మ్యూట్ బౌరప్ ఎగెడే' (Mute Bourup Egede).. ఈ ద్వీపం అమ్మకం కోసం కాదు.. ఎప్పటికీ అమ్మకానికి ఉండదని పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్
గ్రీన్‌ల్యాండ్ అనేది అత్యంత సుందరమైన ఐలాండ్. ఇక్కడ అపారమైన ఖనిజ (రాగి, లిథియం) సంపద ఉంది. లిథియం అనేది ఎలక్ట్రిక్ వాహనాలలో, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో విరివిగా ఉపయోగిస్తారు. ఇక్కడి ఖనిజ సంపద విలువ సుమారు రూ. 94 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటి ద్వీపాన్ని అమెరికా సొంతం కొనుగోలు చేయడం బహుశా అసాధ్యమే.
Comments
Please login to add a commentAdd a comment