ఈబైక్ గో తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో లాంఛ్ చేసింది. దీనిని రగ్డ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది రెండు వేరియెంట్లలో లభిస్తుంది. మొదటి రగ్డ్ జీ1 ధర రూ.84,999గా ఉంటే, రగ్డ్ జీ1 ప్లస్ ధర రూ.1,04,999గా ఉంది. నవంబర్ 2021 మొదటి వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈబైక్ గో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై వివిధ రాష్ట్రాల సబ్సిడీ కూడా లభిస్తుంది. ఈబైక్ గో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3కెడబ్ల్యు మోటార్ ఉంది. ఇది దాని డ్యూయల్ 2కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు.
సున్నా శాతం నుంచి ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 3.5 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ. వెళ్లగలదు అని ఈబైక్ గో పేర్కొంది. ఇది స్టీల్ ఫ్రేమ్ తో క్రెడిల్ ఛాసీస్ పై నిర్మించబడింది. సుమారు 30 లీటర్ల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో 12 బిల్ట్ ఇన్ స్మార్ట్ సెన్సార్లు ఉన్నాయి. వీటి ద్వారా ఎలక్ట్రిక్ బైక్ లాక్, అన్ లాక్ చేయవచ్చు. దీనిలో యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. ఈ యాంటీ థెఫ్ట్ ఫీచర్ వల్ల అదనపు భద్రత లభిస్తుంది. ఈ స్కూటర్ నుఎవరైనా టచ్ చేస్తే ఆటోమెటిక్ గా అలారం మొగుతుంది. దీనిలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఫ్లీట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉంది. ఈ స్కూటర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ఈ స్కూటర్ ఛాసిస్ 7 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. (చదవండి: హీరో ఎలక్ట్రిక్ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్)
Comments
Please login to add a commentAdd a comment