
చెన్నై: భారత్ మానవసహిత అంతరిక్ష యాత్రకు గగన్‌యాన్ మిషన్‌ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. మిషన్‌లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సు కూడా పూర్తి చేసుకున్నారు. కాగా తాజాగా ఇస్రో మానవ సహిత అంతరిక్షయాత్ర కోసం గగన్‌యాన్ మిషన్‌లో వాడే లిక్విడ్ ప్రోపెలెంట్ వికాస్ ఇంజన్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
తమిళనాడులోని మహేంద్రగిరి సమీపంలోని ఇస్రో ప్రొపల్షన్ కంప్లెక్స్‌లో వికాస్ ఇంజన్‌ను 240 సెకండ్లపాటు విజయవంతంగా ఇస్రో పరిక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌లో పేర్కొంది. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా వికాస్ ఇంజిన్‌పై మూడవ దీర్ఘకాలిక హాట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ఎలన్ మస్క్ బుధవారం ట్విటర్‌లో అభినందించారు.
Congratulations! 🇮🇳
— Elon Musk (@elonmusk) July 14, 2021
Comments
Please login to add a commentAdd a comment