టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకొనున్నాడు. మస్క్ సొంతంగా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను తేచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌కు పోటీగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను తెచ్చేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ట్విటర్‌లో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు.
ఫ్రీ స్పీచ్ నిబంధనలకు అనుకూలంగా..!
ఎలన్ మస్క్ సొంతంగా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నారా? అది ఫ్రీ స్పీచ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తుందా? ఓపెన్ సోర్స్ అల్గారిథమ్ బేస్‌తో ఆ సోషల్ మీడియా వేదిక ఉంటుందా? అందులో దుష్ప్రచారానికి తావు ఉండదా? అంటే.. ఎలన్ మస్క్ ఔను అనే రీతిలోనే తాజాగా ట్వీట్ చేశారు. ప్రీ స్పీచ్ నేపథ్యంలో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను తెచ్చేందుకు ప్రణాళికలను రచిస్తోన్నట్లు వివరించారు. ఓ ట్విటర్‌లో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు ఎలన్ మస్క్.
స్మార్ట్‌ఫోన్స్‌తో పాటుగా సోషల్‌మీడియాపై గురి..
ఎలక్ట్రిక్ వాహనాలు, స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ ఇంటర్నెట్ ఇలా ఎన్నో సేవలను ఎలన్ మస్క్ సంస్థలు అందిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం యాపిల్ స్మార్ట్‌ఫోన్లకు పోటీగా టెస్లా స్మార్ట్‌ఫోన్స్‌ను కూడా తెచ్చేందుకు మస్క్ సన్నాహాలు చేస్తోన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు ఓ ట్విట్టర్ యూజర్ ఎలన్ మస్క్‌ను అడిగారు. ఓపెన్ సోర్స్ అల్గారిథమ్‌తో ఫ్రీ స్పీచ్‌కు టాప్ ప్రయారిటీ ఇచ్చేలా, విష ప్రచారానికి తావే లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. తాను ఈ విషయాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఎలన్ మస్క్ సమాధానం ఇచ్చారు.
Is a new platform needed?
— Elon Musk (@elonmusk) March 26, 2022
పోల్..సానుకూలంగా నెటిజన్లు..!
యూజర్ల వాక్ స్వాతంత్ర్యం ట్విటర్ దెబ్బతీస్తోందని ఎలన్ మస్క్ ఈ నెల 25న ఒక ట్విట్ చేశారు. ట్విటర్ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నదని మీరు భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై పోల్ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో 70 శాతం మంది అమలు చేయడం లేదని స్పందించారు. ఆ తర్వాత దానికి ఎలన్ మస్క్ మరో ట్వీట్ జత చేశారు. ఈ పోలింగ్ తర్వాతి పరిణామాలు చాలా ప్రధానమైనవని, కాబట్టి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఓటు వేయాలని నెటిజన్లను ఆయన కోరారు. అంతేకాకుండా మరో ట్వీట్‌లో.. ట్విట్టర్ ప్రజలకు చాలా చేరువ అయిందని, పబ్లిక్ టౌన్ స్క్వేర్‌గా ఉన్నదని, కానీ, ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉండే భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నదని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే ఆయన 26వ తేదీన ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అవసరం ఉన్నదా? అని అడిగారు. ఇక కొత్త సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంను మస్క్ నిర్మిస్తే..ప్రముఖ టెక్ సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకు భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ యూజర్లను తనవైపుకు లాగేసుకునే అవకాశాలు కలవు.
చదవండి: జోబైడెన్ కీలక నిర్ణయం: ఆ 700మందికి చుక్కలే..వారిలో ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ కూడా!
Comments
Please login to add a commentAdd a comment