పరస్పర నమ్మకంతో కాకుండా పరస్పర అనుమానాలతో మొదలైన ట్విటర్ డీల్ అనేక మలుపులు తీసుకుంటోంది. ట్విటర్‌లో స్పామ్/ఫేక్ అకౌంట్లు అధికంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత వచ్చే వరకు డీల్‌లో అడుగు ముందుకు పడదంటూ ఈలాన్‌మస్క్ ప్రకటించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ట్విటర్ బోర్డు వ్యవహరిస్తోంది.
పేచీ అక్కడే
ట్విటర్‌లో ఒక్కో షేరుకు 54.20 డాలర్లుగా వెల కట్టి ఏకమొత్తంగా 44 బిలియన్ డాలర్లు చెల్లించి ట్విటర్‌ను టేకోవర్ చేస్తానంటూ ఈలాన్‌మస్క్ ప్రకటించారు. ట్విటర్ బోర్డు నుంచి వ్యతిరేకత వచ్చినా షేర్ హోల్డర్లు ఈ డీల్‌కు సానుకూలంగా ఉండటంతో.. ఇరు వర్గాల మధ్యన ఒప్పందం జరిగింది. మరికొద్ది రోజుల్లో ట్విటర్ ఈలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్తుందనగా ఫేక్ అకౌంట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య పేచీ మొదలైంది.
షరతులు వర్తిస్తాయి
ట్విటర్ టేకోవర్‌కి సంబంధించిన ఒప్పందంలో... ఎవరైనా ఈ డీల్ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గితే వన్ బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు డీల్ విషయంలో ఈలాన్ మస్క్ మాట మారుస్తున్నందున తాము ఒప్పందంలోని కండీషన్స్‌ను అప్లై చేయాలని ట్విటర్ బోర్డు కోరనున్నట్టు సమాచారం. అంటే ఈలాన్‌మస్క్‌ను వన్ బిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా కట్టమని అడుగుతామంటోంది.
అదొక్కటే మార్గం
ఒప్పందం డీల్ ప్రకారం ఈలాన్ మస్క్ ఈ భారీ పరిహారం నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. వెరిఫైడ్ సోర్స్ ద్వారా తాను ఆరోపిస్తున్నట్టుగా ట్విటర్‌లో ఫేక్ ఖాతాలు 20 శాతంగా ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మస్క్ ఎటువంటి పరిహారం కట్టాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈ ట్విటర్ డీల్ మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment