టెక్సాస్ సరిహద్దులో మస్క్ - వీడియో వైరల్ | Elon Musk Visits Eagle Pass: Viral Video | Sakshi
Sakshi News home page

Elon Musk: టెక్సాస్ సరిహద్దులో మస్క్ - వీడియో వైరల్

Published Fri, Sep 29 2023 5:11 PM | Last Updated on Fri, Sep 29 2023 5:54 PM

Elon Musk Visits Eagle Pass Video Viral - Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో గమనిస్తే, ఇతడు టెక్సాస్ సరిహద్దు ప్రాంతం ఈగిల్ పాస్ సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చాలా రోజుల నుంచి వలసదారులు తిరుగుతున్నారని, ఇందులో కష్టపడి పనిచేసే వారిని మాత్రమే స్వాగతించాలని, దీనికోసం చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ చేయాలనీ వెల్లడించాడు. అంతే కాకుండా వలసదారులకు నేను చాలా అనుకూలంగా ఉంటానని తెలిపాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఎడిట్ చేయకుండా.. ఉన్నది ఉన్నట్లుగా షేర్ చేసినట్లు మస్క్ తెలిపాడు. ఇందులో మస్క్ బ్లాక్ టీ షర్ట్, కౌబాయ్ టోపీ, కళ్లజోడు ధరించి ఉన్నాడు. ఇటీవల చాలామంది వలసదారులు మెక్సికో సరిహద్దు దాటి, టెక్సాస్‌లోకి అడుగుపెడుతున్నారని, నేను (మస్క్) కూడా అమెరికాకు వలస వచ్చిన వ్యక్తినని గుర్తు చేసుకున్నాడు.

ఇదీ చదవండి: రేపే లాస్ట్ డేట్ - మిగిలిన రూ.2000 నోట్ల పరిస్థితి ఏంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement