
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కూడా గృహ రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్లు గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ మనీష్ షా వెల్లడించారు. ప్రస్తుతం తమ గ్రూప్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రాజెక్టులున్న కొన్ని ప్రాంతాల్లో వీటిని అందిస్తున్నట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చిన్న, మధ్యతరహా సంస్థలు మొదలైన వాటికి రుణాలు ఇస్తున్నట్లు, ఈ పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 500 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 6 శాఖలు ఉండగా వీటిని పదికి పెంచుకుంటున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment