EPFO New Pension Scheme 2022: EPFO Planning To Introduce New Pension Scheme - Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌వో కొత్త పింఛను? కొత్త మార్గదర్శకాలు ఇలా..

Published Mon, Feb 21 2022 8:02 AM | Last Updated on Mon, Feb 21 2022 11:37 AM

EPFO Planning To Introduce New Pension Scheme - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ రూ.15,000కు పైగా మూలవేతనం ఉన్న వారికి కొత్త పింఛను పథకం తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. ప్రస్తుతం ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ 95 కింద పింఛను జమలకు రూ.15,000 వరకు మూలవేతనాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కనుక ఇంతకుమించి మూలవేతనం ఉన్న వారు చేరినా అది రూ.15వేలకే పరిమితం అవుతుంది. అటువంటప్పుడు పెన్షన్‌ ఖాతాకు ఎక్కువగా జమ చేసుకోవడం వీలు పడదు. ‘‘దీంతో నెలవారీగా రూ.15వేలకు మించి వేతనం ఉన్నా, తక్కువ జమ (8.33 శాతం) వల్ల వారు తక్కువ పెన్షన్‌ పొందాల్సి వస్తోంది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

అయితే  ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల నుంచి ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. కానీ మూలవేతనం ఎక్కువగా ఉన్న వారికి ఉపయోగకరంగా ఉండేలా మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతోంది. 2022 మార్చి  11, 12 తేదీల్లో గౌహతిలో జరిగే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

చదవండి: మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై సీబీటీ కీలక సమావేశం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement