
బెంగళూరు: గూగుల్ పిక్సల్ ఫోన్ల విక్రయానంతర పూర్తి స్థాయి సేవలను ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ అయిన ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ భారత్‌లో ఆఫర్ చేయనుంది. నోయిడాలో కేంద్రీకృత మరమ్మతుల కేంద్రంతోపాటు, దేశవ్యాప్తంగా 27 పట్టణాల్లో సర్వీస్ సెంటర్ల ద్వారా ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ సేవలు అందించనుంది.
ఫోన్‌ను తీసుకోవడం, పరీక్షించడం, మరమ్మతులు చేయడం, తిరిగి కస్టమర్‌కు అందించే సేవలను ఆఫర్ చేయనున్నట్టు ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ ప్రకటించింది. ఫోన్లకు మరమ్మతులు చేయాల్సి వస్తే నోయిడాలోని ప్రధాన సర్వీస్ సెంటర్‌కు పంపించి పూర్తి చేస్తారు.