
న్యూఢిల్లీ: ముందస్తు పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) డిసెంబర్ 16వ తేదీ వరకూ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే 54 శాతం పెరిగి దాదాపు 4.60 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక వ్యవస్థలో రికవరీకి ఈ గణాంకాలు సూచిస్తున్నట్లు ఆర్థిక శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
- 2021–22 డిసెంబర్ 16 నాటికి ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు రూ. 9.45 లక్షల కోట్లు. గత ఏడాది కాలంతో పోలిస్తే 61 శాతం పెరిగాయి. 2020–21 డిసెంబర్ వరకూ ఈ వసూళ్లు రూ. 5.88 లక్షల కోట్లు.
- మొత్తం అడ్వాన్స్ పన్నులో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.3,49,045.4 కోట్లుకాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.1,10,871.7 కోట్లు.
- అడ్వాన్ పన్ను మూడవ విడత చెల్లింపులకు చివరితేదీ ప్రతి యేడాదీ డిసెంబర్ 15. బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాత వసూళ్ల మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది.
- కాగా 2021–22లో డిసెంబర్ 16 వరకూ రిఫండ్స్ విలువ రూ.1,35,093.6 కోట్లు.
- ఏప్రిల్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 13 మధ్య 1.27 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.1,36,779 కోట్ల రిఫండ్స్ జరిపింది. 1,25,34,644 పన్ను లావాదేవీల విషయంలో ఆదాయపు పన్ను రిఫండ్స్ రూ.46,438 కోట్లు. ఇక కార్పొరేట్ రిఫండ్స్ రూ.90,340 కోట్లు (2,02,705 పన్ను లావాదేవీలు). మొత్తం రిఫండ్స్‌లో రూ.18,848.60 కోట్లు (90.95 లక్షలు లావాదేవీలు) 2021–22 అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై)కి సంబంధించినవి.
Comments
Please login to add a commentAdd a comment