Advance Taxes
-
కేంద్రానికి కాసుల వర్షం! భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అడ్వాన్స్ ట్యాక్స్ అదుర్స్..
కార్పొరేట్ల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ( Direct Tax Collection) 23.51 శాతం పెరిగి రూ.8.65 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) సెప్టెంబర్ 16 నాటికి నికరంగా రూ. 8,65,117 కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలయ్యాయి. ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్ను (సీఐటీ) రూ. 4,16,217 కోట్లు. వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) కలిపి రూ. 4,47,291 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.51 శాతానికి పైగా పెరిగాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) అడ్వాన్స్ ట్యాక్స్ అదుర్స్ ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబర్ మధ్య వరకు రూ. 3.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలు చేసిన రూ. 2.94 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 21 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 16 నాటికి వసూలైన రూ. 3.55 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రూ. 2.80 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 74,858 కోట్లు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 16 వరకు దాదాపు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్లను ట్యాక్స్ పేయర్స్‌కు ప్రభుత్వం జారీ చేసింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) -
ముందస్తు పన్ను వసూళ్లు రూ.4.60 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ముందస్తు పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) డిసెంబర్ 16వ తేదీ వరకూ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే 54 శాతం పెరిగి దాదాపు 4.60 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక వ్యవస్థలో రికవరీకి ఈ గణాంకాలు సూచిస్తున్నట్లు ఆర్థిక శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - 2021–22 డిసెంబర్ 16 నాటికి ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు రూ. 9.45 లక్షల కోట్లు. గత ఏడాది కాలంతో పోలిస్తే 61 శాతం పెరిగాయి. 2020–21 డిసెంబర్ వరకూ ఈ వసూళ్లు రూ. 5.88 లక్షల కోట్లు. - మొత్తం అడ్వాన్స్ పన్నులో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.3,49,045.4 కోట్లుకాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.1,10,871.7 కోట్లు. - అడ్వాన్ పన్ను మూడవ విడత చెల్లింపులకు చివరితేదీ ప్రతి యేడాదీ డిసెంబర్ 15. బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాత వసూళ్ల మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. - కాగా 2021–22లో డిసెంబర్ 16 వరకూ రిఫండ్స్ విలువ రూ.1,35,093.6 కోట్లు. - ఏప్రిల్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 13 మధ్య 1.27 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.1,36,779 కోట్ల రిఫండ్స్ జరిపింది. 1,25,34,644 పన్ను లావాదేవీల విషయంలో ఆదాయపు పన్ను రిఫండ్స్ రూ.46,438 కోట్లు. ఇక కార్పొరేట్ రిఫండ్స్ రూ.90,340 కోట్లు (2,02,705 పన్ను లావాదేవీలు). మొత్తం రిఫండ్స్‌లో రూ.18,848.60 కోట్లు (90.95 లక్షలు లావాదేవీలు) 2021–22 అసెస్మెంట్ ఇయర్ (ఏవై)కి సంబంధించినవి. -
ముందస్తు పన్ను వసూళ్లు 25.5 శాతం డౌన్!
ముంబై: ముందస్తు పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 25.5 శాతం క్షీణించాయి. కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా పడిపోవడం దీనికి కారణమని ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు గురువారం తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం– 2020–21 రెండవ త్రైమాసికకాలంలో రూ.1,59,057 కోట్ల ముందస్తు పన్ను వసూళ్లు జరిగాయి. 2019–20 ఇదే కాలంలో వసూళ్ల మొత్తం రూ. 2,12,889 కోట్లు. ఇక్కడ కొంతలో కొంత ఊరట కలిగించే అంశం ఏమిటంటే, 2020–21 తొలి త్రైమాసికం కన్నా రెండవ త్రైమాసికంలో క్షీణ రేటు కొంత తగ్గడమే. తొలి త్రైమాసికంలో ముందస్తు పన్ను వసూళ్లు భారీగా 76 శాతం పడిపోయి కేవలం రూ.11,714 కోట్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రేరిత పరిస్థితులతో దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడం ఈ పేలవ వసూళ్ల నేపథ్యం.ముందస్తు పన్ను చెల్లింపులకు సెప్టెంబర్ 15 చివరితేదీ. తాజా సమాచారంలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ కార్పొరేట్ చెల్లింపులు 27.3 శాతం తగ్గి రూ.1,29,620 కోట్లగా నమోదయ్యాయి. జూన్ త్రైమాసికంలో ఈ విభాగంలో వసూళ్లు 79 శాతం పడిపోయి, రూ.8,286 కోట్లుగా నమోదయ్యాయి. ♦ వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగం విషయంలో 15 శాతం తగ్గి రూ.29,438 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ1లో ఈ వసూళ్లు 64 శాతం తగ్గి, రూ. 3,428 కోట్లకు పడిపోయాయి. ముందస్తు పన్నులంటే... ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమకు వచ్చే ఆదాయాలను మదింపుచేసుకుని, నాలుగు దఫాలుగా ముందస్తు పన్ను చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. మొత్తం చెల్లించాల్సిన పన్ను అంచనాల్లో 15 శాతం మొదటి త్రైమాసికంలో చెల్లించాల్సి ఉంటుంది. 25 శాతం చొప్పున తదుపరి రెండు త్రైమాసికాల్లో చెల్లింపులు జరపాలి. నాల్గవ త్రైమాసికంలో ఈ చెల్లింపులు 35 శాతంగా ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొత్తం స్థూల పన్ను వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.24.23 లక్షల కోట్లు. 2019–20 వసూళ్ల కన్నా (రూ.21.63 లక్షల కోట్లు) ఇది 12 శాతం ఎక్కువ. ఇందులో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని 28 శాతం పెంపుతో రూ.10.28 లక్షల కోట్ల నుంచి రూ.13.19 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పన్ను వివాద పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’కు మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం భావించడమే దీనికి కారణం. ఈ పథకం కింద సెప్టెంబర్ 8 నాటికి 35,074 ప్రత్యక్ష పన్ను సంబంధ వివాదాలు పరిష్కారం అయినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కమిషనర్ ఆఫ్ అప్పీల్స్, ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీకోర్టుసహా దేశ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల అపరిష్కృత ప్రత్యక్ష పన్ను వివాదాలు ఉండడం గమనార్హం. కార్ల మీద జీఎస్టీ తక్కువే ♦ కంపెనీలే రాయల్టీలు తగ్గించుకోవాలి ♦ ఆర్థిక శాఖ వర్గాలు వాహనాలపై జీఎస్టీ రేటు భారీగా ఉంటోందన్న విమర్శలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పందించాయి. జీఎస్టీ అమలుకు ముందు రోజులతో పోలిస్తే ప్రస్తుతం రేటు తక్కువగానే ఉందని వ్యాఖ్యానించాయి. జీఎస్టీ రేటు తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని అడగడం కాకుండా వాహనాల కంపెనీలు విదేశాల్లోని తమ మాతృ సంస్థలకు రాయల్టీ చెల్లింపులను తగ్గించుకోవాలని సూచించాయి. అప్పట్లో వ్యాట్, ఎక్సైజ్ సుంకం రేటు మొదలైనవి అనేకం ఉండేవని ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ రేట్లు తక్కువేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్స్‌పై అధిక స్థాయిలోనే పన్నులు ఉంటున్నాయని తెలిపాయి. యూరోపియన్ యూనియన్‌లో వాహనాలపై వ్యాట్/జీఎస్టీ 20 శాతం – 25 శాతం మధ్యలో ఉంటోందని వివరించాయి. -
అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 11 శాతం వృద్ధి
ముంబై జోన్లో రూ. 69,000 కోట్లు ముంబై: మొండి బాకీల భారంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అంతంతమాత్రం చెల్లింపులు జరగడంతో ఈసారి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఓ మోస్తరు వృద్ధినే నమోదు చేశాయి. టాప్ 100 కార్పొరేట్లలో 45 సంస్థలకు కేంద్రమైన ముంబై జోన్లో సెప్టెంబర్ 15 నాటికి.. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు కేవలం 11 శాతం వృద్ధితో రూ. 69,000 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో వసూలైన మొత్తం రూ. 62,370 కోట్లు. వసూళ్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆదాయ పన్ను శాఖ.. రాబోయే రోజుల్లో పెద్ద కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చెల్లింపులు ఏకంగా 37% మేర తగ్గగా, విదేశీ సంస్థ సిటీ గ్రూప్ 34% తక్కువ చెల్లించింది. మరోవైపు చమురు దిగ్గజం హెచ్‌పీసీఎల్, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ చెల్లింపులు 70% ఎగిశాయి. హెచ్డీఎఫ్సీ 10.47% అధికంగా చెల్లించింది. మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో మూడో వంతు ముంబై జోన్లోనే నమోదవుతుంటుంది. సెప్టెంబర్ 15 నాటి దాకా ఈ జోన్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 25% వృద్ధితో రూ. 96,000 కోట్ల నుంచి రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 3.16 లక్షల కోట్లు సమీకరించాలని ముంబై జోన్ లక్ష్యంగా ఉంది. ఏప్రిల్–సెప్టెంబర్ ఆదాయ అంచనాలు ఇవ్వాలి.. కంపెనీలు, పన్ను చెల్లింపుదారులు తమ ఖాతాలు ఇంకా ఆడిటింగ్ దశలోనే ఉన్న పక్షంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు సంబంధించిన ఆదాయ అంచనాలను, కట్టాల్సిన పన్ను వివరాలను ఐటీ శాఖకు సమర్పించాల్సి రానుంది. దీనికి నవంబర్ 15దాకా గడువు లభించనుంది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో చేయనున్న మార్పులపై అభిప్రాయాలు కోరుతూ కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్‌ను రూపొందించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు తగ్గిన పక్షంలో అందుకు గల కారణాలు కూడా కంపెనీలు వివరించాల్సి ఉంటుంది. దీంతో ఆయా సంస్థల ఆదాయ ధోరణులపై ఎప్పటికప్పుడు సమాచారం లభించగలదు.