ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కరోనా యాంటిజెన్ టెస్ట్ కిట్ల అమ్మకాలు ప్రారంభించింది. "కోవిసెల్ఫ్" అనే రూ.250 ఖరీదైన ఈ యాంటీజెన్ టెస్ట్ కిట్‌ను ఉపయోగించుకొని కరోనా పాజిటీవా, నెగిటీవా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ కిట్ ను రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు కూడా వినియోగించుకోవచ్చు. సెకండ్ వేవ్‌లో కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఒకరకంగా చెప్పాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చేది.
కానీ ఇప్పడు ఇంట్లోనే ఉండి కోవిసెల్ఫ్ కిట్లతో పరీక్ష చేసుకుని 15 నిమిషాల్లో కరోనా ఫలితాలు పొందొచ్చు. పూణేకి చెందిన మైల్యాబ్ డిస్కవరీ అనే సంస్థ ర్యాపిడ్ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో యాంటిజెన్ కిట్‌ను తయారు చేసింది. ఇప్పటికే "కోవిసెల్ఫ్" కరోనా టెస్ట్ కిట్‌ను గతేడాది నవంబర్‌లో అమెరికా ఎఫ్‌డీఐ అనుమతులిచ్చింది. తాజాగా ఈ కోవిసెల్ఫ్ కిట్‌ను ఐసీఎంఆర్ సహకారంతో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.250కే ఈ కిట్‌ను అందిస్తుండగా.. కిట్ లో టెస్ట్ కార్డ్, ట్యూబ్, డిస్పోజల్ బ్యాగ్ ఉంటాయి.
చదవండి : వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేయండిలా.!
Comments
Please login to add a commentAdd a comment