21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం  | FOMC Meeting on September 21st 2022 with bankers | Sakshi

21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం 

Sep 20 2022 12:07 PM | Updated on Sep 20 2022 12:11 PM

FOMC Meeting on September 21st 2022 with bankers - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 21వ తేదీన (బుధవారం) ప్రభుత్వ రంగ బ్యాంక్‌ చీఫ్‌లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. పీఎస్‌బీలు, ఫైనాన్షియల్‌ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఎంపిక ప్రణాళకలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌ ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల ప్రొక్యూర్‌మెంట్‌ పక్రియపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది.

ఫైనాన్షియల్‌ సేవల కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో జరగనున్న ఈ వర్చువల్‌ సమావేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సంస్థల చీఫ్‌లు పాల్గొంటారు. ఈ ఏడాది అక్టోబర్‌ 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ప్రత్యక ‘స్వచ్ఛతా’ కార్యక్రమ 2.0 ప్రచారం, సన్నద్ధతపై కూడా సమావేశం చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement