FOMC
-
గరిష్ట స్థాయిలో స్థిరీకరణకు అవకాశం
ముంబై: కొత్త సంవత్సరం తొలి వారంలో స్టాక్ సూచీలు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆటో సేల్స్ అమ్మకాలు, పీఎంఐ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘గత ఏడాది ట్రేడింగ్ చివరి వారంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, కొంత లాభాల స్వీకరణ ఉండొచ్చు. కావున ట్రేడర్లు స్థిరీకరణలో భాగంగా దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,200 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లే లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21,500 వద్ద బలమైన తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేశ్ గౌర్ తెలిపారు. ఆటో అమ్మకాలు ఆటో కంపెనీలు డిసెంబర్ నెల వాహన అమ్మకాలను నేడు(సోమవారం) విడుదల చేయనున్నాయి. టూ వీలర్స్ అమ్మకాలు రెండింతల వృద్ధి నమోదు చేయోచ్చని, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య, ట్రాకర్ విభాగ విక్రయాల వృద్ధి ఫ్లాటుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విక్రయ గణాంకాలు వినియోగ డిమాండ్, పరిశ్రమ స్థితిగతులను తెలియజేస్తాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు గురువారం వెల్లడి కాన్నాయి. ఈ 2024లో మూడుసార్లు వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఎఫ్ఓఎంసీ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. డిసెంబర్లో రూ.66,000 కోట్లు పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో 66,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి డిసెంబర్లో విదేశీ నిధుల వరద పోటెత్తింది. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతో పాటు డెట్, హైబ్రీడ్, డెట్ –వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి. -
21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 21వ తేదీన (బుధవారం) ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్‌లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. పీఎస్‌బీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఎంపిక ప్రణాళకలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ప్రొక్యూర్మెంట్ పక్రియపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరగనున్న ఈ వర్చువల్ సమావేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థల చీఫ్‌లు పాల్గొంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ప్రత్యక ‘స్వచ్ఛతా’ కార్యక్రమ 2.0 ప్రచారం, సన్నద్ధతపై కూడా సమావేశం చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. -
ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చాన్స్
ముంబై: హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం డేటా వెల్లడి (మంగళవారం) మినహా దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున.. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు ప్రపంచ పరిణామాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం వెల్లడి కానున్న ఫెడ్ రిజర్వ్ జూలై పాలసీ సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో సెన్సెక్స్ 1,075 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగిరావడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ‘‘గడిచిన రెండు నెలల్లో సూచీలు 16% ర్యాలీ చేయడంతో మార్కెట్ ఓవర్‌బాట్ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు వీలుంది. సాంకేతికంగా నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 17,850 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,350–17,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఎఫ్ఓఎంసీ మినిట్స్: ఫెడ్ జూలై పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 16న (బుధవారం) ప్రకటించనుంది. ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, మాంద్యంతో పాటు వడ్డీ రేట్లపై ఫెడ్ పాలసీ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలమని నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా మంగళవారం గతవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. అదేరోజన జూలై హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. జూన్‌తో పోలిస్తే (15.18 శాతం) ఈ జూలై డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం దిగిరావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జూలై మాసపు ప్యాసింజర్ వాహన అమ్మకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. అలాగే ఆర్బీఐ ఆగస్టు 13 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల ఐదో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఆగస్టు 1–15 తేదీల మధ్య రూ. 22,452 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది(2021) అక్టోబర్‌లో మొదలైన విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ జూన్ నాటికి రూ.2.46 లక్షల కోట్ల నిధులను భారత ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా.., ఈ జూలైలో రూ. 6295 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జూలై నెల నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవడం, ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న తగు నిర్ణయాలతో విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభించాయి’’ కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రీటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. ఈ వారంలోనూ ట్రేడింగ్ 4 రోజులే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (నేడు) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీతో పాటు కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి మంగళవారం యధావిధిగా ప్రారంభమవుతాయి. -
బడ్జెట్ అంచనాలు, ఫలితాలే నడిపిస్తాయ్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి కేంద్ర బడ్జెట్ ప్రకటనపై మార్కెట్ వర్గాలు కొండంత ఆశతో ఉన్నాయి. నీరసించిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వృద్ధిని గాడిన పెట్టడం కోసం.. కేంద్ర బడ్జెట్ 2020–21లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 1న (శనివారం) వెల్లడికానున్న ఈ బడ్జెట్లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తగ్గింపు, ఆదాయ పన్ను శ్లాబుల్లో సవరణలు, కస్టమ్స్ డ్యూటీ రేట్లలో మార్పులు ఉండవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ కంపెనీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్లను తగ్గించడం వంటి నిర్ణయాలు మార్కెట్‌ను నిలబెట్టే అవకాశం ఉందని అంచనావేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది..? కంపెనీల ఫలితాలు ఎలా ఉండనున్నాయనే కీలక అంశాలే ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ప్రకటనలు అటూ ఇటుగా ఉంటే పతనానికి ఆస్కారం ఉన్నందున.. ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక కేవలం బడ్జెట్ అంశాన్నే చూడకుండా.. ఫండమెంటల్‌గా బలంగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. ట్రేడింగ్ 6 రోజులు: శనివారం కేంద్ర బడ్జెట్ వెలువడనున్న కారణంగా ఆ రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ పనిచేయనుంది. సాధారణ రోజుల్లో మాదిరిగానే వారాంతాన ట్రేడింగ్ కొనసాగుతుందని ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. దీంతో ఈవారంలో ట్రేడింగ్ ఆరు రోజులకు పెరిగింది. ఒడిదుడుకులకు ఆస్కారం.. మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం ఉండడం.. గురువారం రోజున జనవరి సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు వంటి పలు కీలక అంశాల నేపథ్యంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య విధానం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫలితాల వెల్లడి కొనసాగుతున్న కారణంగా స్టాక్ స్పెసిఫిక్‌గా భారీ కదలికలు ఉండొచ్చని అన్నారు. 400 కంపెనీల ఫలితాలు... ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీతో పాటు టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, కోల్గేట్ పామోలివ్, మారికో, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, భారతీ ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐఓసీ, డాబర్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, యునైటెడ్ స్పిరిట్స్, టొరెంట్ ఫార్మా, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్, టాటా పవర్, ఎస్కార్ట్స్, గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. జనవరిలో రూ.1,624 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జనవరిలో ఇప్పటివరకు రూ.1,624 కోట్ల పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 1–24 కాలానికి ఈక్విటీ మార్కెట్లో రూ. 13,304 కోట్లను ఇన్వెస్ట్ చేసిన వీరు.. డెట్ మార్కెట్ నుంచి రూ. 11,680 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వీరి నికర పెట్టుబడి పేర్కొన్న మేరకు ఉన్నట్లు డేటా ద్వారా వెల్లడయింది. -
అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితంకావడం, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ ఒక శాతం నష్టాలను నమోదుచేసింది. నిఫ్టీ 12,000 పాయింట్ల సైకలాజికల్ మార్కును కోల్పోయింది. ఇక ఈ వారంలో మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉండనుందనే అంశానికి వస్తే.. ఒడిదుడుకులకే ఆస్కారం ఉందని, మరింత కరెక్షన్కు ఆస్కారం ఉందని అధిక శాతం విశ్లేషకులు అంచనావేస్తున్నారు. బలహీనమైన వృద్ధి, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుత ప్రీమియం వాల్యుయేషన్ నిలబెట్టుకునే అవకాశం లేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా సులభమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తే మాత్రం మన మార్కెట్లలో పతనానికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ 11,750–12,100 స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. ట్రేడ్ డీల్‌పై ఆశలు నవంబర్‌లో అమెరికాలోని నిరుద్యోగుల రేటు 3.5 శాతానికి తగ్గడం, వాణిజ్య ఒప్పందంపై పెరిగిన ఆశావాదం కారణంగా శుక్రవారం అక్కడి స్టాక్ సూచీలు ఒక శాతం లాభాలను నమోదుచేశాయి. అమెరికా అనేక విడతల్లో చైనా వస్తువులపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే కాగా, ఈ నెల 15 నుంచి 156 బిలియన్ డాలర్ల కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈ గడువుతేదీ కంటే ముందుగానే అమెరికా–చైనాల మధ్య తొలి విడత వాణిజ్య ఒప్పందాలు పూర్తయ్యే సూచనలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే మన మార్కెట్ కూడా సానుకూలంగా స్పందించనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫెడ్ సమావేశంపై దృష్టి వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఈ ఏడాదిలో చివరిసారిగా జరిగే ఈ సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు భారత మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ఇక గురువారం యూకేలో జరిగే సాధారణ ఎన్నికలు బ్రెగ్జిట్‌కు ఒక దిశను ఇవ్వనున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు పెరిగిన ముడిచమురు ధరలు ఈవారం మార్కెట్ గమనానికి మరో కీలక అంశంగా మారాయి. ఆర్థికాంశాల ప్రభావం అక్టోబర్ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ), నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) డేటా గురువారం వెల్లడికానున్నాయి. శుక్రవారం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం డేటా విడుదలకానుంది. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈనెల్లో ఇప్పటివరకు రూ. 244 కోట్లను భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల సమాచారం మేరకు.. గడిచిన వారంలో వీరు రూ. 1,669 కోట్లను ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. అయితే, డెట్ మార్కెట్లో రూ.1,424 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా వీరి నికర ఉపసంహరణ రూ. 244 కోట్లుగా నిలిచింది. -
అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!
ముంబై: సూపర్ రిచ్ ట్యాక్స్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తేల్చిచెప్పకపోడం, ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపే విధంగా ప్రకటనలు చేయకపోవడం వంటి నిరాశాపూరిత వాతావరణంలో గతవారం దేశీ ప్రధాన స్టాక్ సూచీలు నష్టాలను నమోదుచేశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) అమ్మకాల ధాటికి అంతక్రితం వారంలో గడించిన లాభాల్లో కొంత కోల్పోయినప్పటికీ.. రిలయన్ ్స ఇండస్ట్రీస్ షేరుకు లభించిన కొనుగోలు మద్దతుతో భారీ నష్టాలకు అడ్డుకట్టపడింది. వారాంతాన నిఫ్టీ 11వేల పాయింట్ల సైకిలాజికల్ మార్కుకు ఎగువన నిలిచింది. ఈ ముగింపుతో కన్సాలిడేషన్ సూచనలు కనిపిస్తుండడం కాస్త సానుకూల అంశంగానే ఉండగా.. ఫలితాల సీజన్ నిరాశపరచడం, అమెరికా–చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధం ప్రపంచ వృద్ధికి సవాలు విసురుతుండటం వంటి ప్రతికూలతల నేపథ్యంలో ఇక్కడ నుంచి మార్కెట్ ఏ దిశగా ప్రయాణిస్తుందనే అంశానికి, అంతర్జాతీయ అంశాలే ఈవారంలో అత్యంత కీలకంగా ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్,పావెల్ ప్రసంగంపై ఇన్వెస్టర్ల దృష్టి.. జాక్సన్ హోల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఈనెల 23న(శుక్రవారం) ప్రసంగం చేయనున్నారు. తదుపరి వడ్డీరేట్ల అంశంపై ఈయన ప్రసంగం ద్వారా పలు సూచనలు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇక్కడ జరగనున్న పరిణామాలపై దృష్టిసారించారు. ఇక బుధవారం ఎఫ్ఓఎంసీ జూలై సమావేశ మినిట్స్ వెల్లడికానుండగా.. అమెరికాలో ఇప్పటికే ఉన్న గృహ అమ్మకాల డేటా కూడా ఇదే రోజున వెల్లడికానుంది. గురువారం యూఎస్ సర్వీసెస్ పీఎంఐ, ఇనీషియల్ జాబ్‌లెస్ క్లెయిమ్స్ గణాంకాలు విడుదలకానున్నాయి. శుక్రవారం నూతన గృహ అమ్మకాల డేటా విడుదలకానుంది. దేశీయంగా ఆర్బీఐ తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశ మినిట్స్ బుధవారం వెల్లడికానున్నాయి. ఈ పరిణామాలపై ఈవారంలో ఇన్వెస్టర్లు దృష్టిసారించారని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. -
ఒడిదుడుకుల వారం
♦ ఎఫ్ అండ్ ఓ ముగింపు నేపథ్యంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు ♦ ఈ నెల 24న శివరాత్రి సెలవు ♦ ట్రేడింగ్ నాలుగు రోజులే న్యూఢిల్లీ: ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగవచ్చని నిపుణులు అంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24(శుక్రవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి...తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిమిత శ్రేణిలో మార్కెట్.. దేశీయంగా ప్రధాన సంఘటనలేవీ లేనందున మన మార్కెట్‌పై అంతర్జాతీయ సంకేతాలే ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు(ఈ నెల 23–గురువారం) కారణంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేస్తారని, ఫలితంగా ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని వివరించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళి ప్రభావం మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వస్తుందన్న సంకేతాలు వెలువడితే స్టాక్ మార్కెట్లో ర్యాలీ వస్తుందని వివరించారు. మొత్తం మీద ఈ వారంలో స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పుకోదగ్గ ప్రధాన సంఘటనలేవీ లేనందున మార్కెట్ స్తబ్ధుగానే ఉండొచ్చని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. ట్రేడర్లు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, స్తంభించిపోయిన పలు ప్రాజెక్టుల భవితవ్యం ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని వివరించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మార్కెట్లో స్వల్పకాలంలో ర్యాలీ ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి కీలకమని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. యూపీ ఫలితాలపైననే సంస్కరణల వేగం అధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు వచ్చే నెల 11న జరుగుతుంది. నిఫ్టీ 8,900 పాయింట్లను చేరితే లాభాల స్వీకరణ చోటు చేసుకుంటుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే యూరోజోన్, అమెరికా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాలు ఈ వారంలోనే రానున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించిన విధానాల రూపకల్పన విభాగం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ), ఆర్బీఐ ఎంపీసీ(మానిటరీ పాలసీ కమిటీ) సమావేశ మినట్స్ కూడా ఈ వారంలోనే వెల్లడవుతాయి. గత వారంలో సెన్సెక్స్135 పాయింట్లు, లాభపడి 28,469 పాయింట్ల వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 8,822 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ పెట్టుబడుల జోరు.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా ఎఫ్‌పీఐలు రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టారు. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించి పన్ను నిబంధనల్లో స్పష్టత కారణంగా ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని నిపుణులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 17వ తేదీ వరకూ మన స్టాక్ మార్కెట్లో రూ.3,002 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,559 కోట్లు వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.9,561 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు రూ.80,310 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
ఫెడ్ పాలసీ యథాతథం
వాషింగ్టన్: ప్రపంచ మార్కెట్లకు ఊరటనిస్తూ.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీని (క్యూఈ3) యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై కూడా నెలకు 85 బిలియన్ డాలర్ల మేర బాండ్ల కొనుగోలును కొనసాగిస్తుంది. అలాగే ఫెడ్ పాలసీ వడ్డీ రేట్లు 0.25 శాతం స్థాయిలోనే ఉండనున్నాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు బుధవారం రాత్రి పొద్దుపోయాక ఫెడ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ చెప్పారు. ఈ నిర్ణయాలు వెలువడిన తర్వాత అమెరికా స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.. పసిడి ధర ఒక్కసారిగా ఎగబాకింది. ఔన్సు(31.1 గ్రాములు) రేటు 30 డాలర్ల పైగా ఎగిసి 1342 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ పాలసీ ప్రభావంతో ఇటు దేశీయంగా కూడా రూపాయి, పసిడి ధరలు, స్టాక్‌మార్కెట్లు పెరిగే అవకాశముందనేది నిపుణులు అంచనా.