న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూపు కంపెనీ అయిన ఫ్యూచర్ లైఫ్ స్టయిల్ ఫ్యాషన్స్ జూన్ త్రైమాసికానికి రూ.1,880 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ నష్టం కేలం రూ.149 కోట్లుగానే ఉంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.831కోట్ల నుంచి రూ.607 కోట్లకు తగ్గింది.
వ్యయాలు రూ.1,438 కోట్లకు పెరిగాయి. విక్రయాలు తగ్గడం, రుణాల ఖర్చులు, ఆస్తుల విలువ తగ్గిపోవడం, కొన్ని రకాల కేటాయింపులు భారీ నష్టాలకు కారణమని సంస్థ తెలిపింది. ఈ సంస్థ నిర్వహణలోని 34 సెంట్రల్ స్టోర్లు, 78 బ్రాండ్ ఫ్యాక్టరీ దుకాణాలు మూతపడినట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment