హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్) నాన్–కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా రూ. 1,250 కోట్లు సమీకరించనుంది. 2024 ఏప్రిల్, 2026 ఫిబ్రవరిలో మెచ్యూర్ కానున్న బాండ్లను (అమెరికన్ డాలర్ల మారకంలోనివి) ముందస్తుగా చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించనుంది. ప్రతిపాదిత బాండ్లకు ‘ఐఎన్‌డీ ఏఏ/స్టేబుల్‘ రేటింగ్ ఇస్తూ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థఈ విషయాలు వెల్లడించింది.
జీహెచ్‌ఐఏఎల్ ప్రతిపాదిత రూ. 250 కోట్ల బ్యాంక్ రుణానికి కూడా ఏజెన్సీ ఇదే రేటింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 30 నాటికి జీహెచ్‌ఐఏఎల్ (అనుబంధ సంస్థలతో పాటు)కు రూ. 7,050 కోట్ల రుణభారం ఉంది. ఇందులో బాండ్లకు సంబంధించి చెల్లించాల్సినది 950 మిలియన్ డాలర్లుగా ఉంది.
చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!
Comments
Please login to add a commentAdd a comment