తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు బుధవారం (జూలై 10) స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా వరుసగా తగ్గుతూవచ్చిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ. 73,200 వద్ద అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.67,100 వద్ద కొనసాగుతన్నాయి. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.67,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.73,350 వద్ద ఉన్నాయి. చెన్నైలో మాత్రం పసిడి ధరల్లో స్పల్పంగా తగ్గింపు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,600 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment