మరింత దిగొచ్చిన బంగారం.. తులం ఎంతంటే.. | Today Gold And Silver Prices October 10th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: మరింత దిగొచ్చిన బంగారం.. తులం ఎంతంటే..

Published Thu, Oct 10 2024 2:50 PM | Last Updated on Thu, Oct 10 2024 3:34 PM

Gold and Silver Price Today On 10 October 2024

Gold Price Today: దేశమంతా పండుగ సందడి నెలకొంది. అందరూ దసరా నవరాత్రలు, దీపావళి ఉత్సాహంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనేవారికి తగ్గుముఖం పడుతున్న ధరలు ఊరట కల్పిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గిన పసిడి రేట్లు నేడు (అక్టోబర్‌ 10) కూడా మరింత దిగివచ్చాయి.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌ , విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.50 తగ్గి రూ.70,250 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.50 క్షీణించి రూ. 76,640 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.

అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లిలోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.70,400 వద్దకు 24 క్యారెట్ల బంగారం రూ.50 తగ్గి రూ.76,790 వద్దకు దిగివచ్చింది.

వెండి ధరలు ఇలా..
Silver Price Today: దేశంలో వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున కేజీకి రూ.2000 తగ్గిన వెండి హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.1 లక్ష వద్ద స్థిరంగా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement