పండుగ ముందు ఒక్కసారిగా ఎగిసిన పసిడి, వెండి | Gold and Silver Price Today On 11 October 2024 | Sakshi
Sakshi News home page

పండుగ ముందు ఒక్కసారిగా ఎగిసిన పసిడి, వెండి

Published Fri, Oct 11 2024 2:28 PM | Last Updated on Fri, Oct 11 2024 2:50 PM

Gold and Silver Price Today On 11 October 2024

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఐదారు రోజులుగా తగ్గుముఖంలో ఉన్న పసిడి రేట్లు శుక్రవారం (అక్టోబర్‌ 11) భారీగా పెరిగాయి. దీంతో దసరా పండుగకు ముందు కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు ఏకంగా రూ.700 పెరిగి రూ.70,950 లకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.760 ఎగిసి రూ. 77,400 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇదే స్థాయిలో ధరలు ఎగిశాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లిలోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.700 పెరిగి రూ.71,100 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం రూ.760 ఎగిసి రూ.77,550 వద్దకు చేరింది.

సిల్వర్‌ మళ్లీ స్వింగ్‌
Silver Price Today: దేశంలో వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. క్రితం రోజున నిలకడగా ఉన్న వెండి నేడు కేజీకి ఏకంగా రూ.2000 పెరిగింది. ఈ బారీ పెంపుతో హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.1,02,000 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement