బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత? | Gold and Silver Price Today On 14 October 2024 | Sakshi
Sakshi News home page

బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత?

Published Mon, Oct 14 2024 11:32 AM | Last Updated on Mon, Oct 14 2024 11:44 AM

Gold and Silver Price Today On 14 October 2024

Gold Price Today: పండుగ తర్వాత బంగారం ధరలు కాస్త ఊరట కల్పించాయి. దేశవ్యాప్తంగా సోమవారం (అక్టోబర్‌ 14) పసిడి ధరల్లో తగ్గుదల నమోదైంది. రెండు తెలుగురాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రధాన ప్రాంతాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.50 తగ్గి రూ.71,150 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.50 క్షీణించి రూ. 77,620 వద్దకు దిగివచ్చింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇలాగే  ధరలు స్వల​ంగా క్షీణించాయి.

అలాగే ఢిల్లిలో నేడు 22 క్యారెట్ల బంగారం రూ.71,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.77,770 వద్ద ఉన్నాయి. రెండు రకాల బంగారం మీద 10 గ్రాములకు రూ.50 చొప్పున తగ్గుదల నమోదైంది.

వెండి నిలకడగానే..
Silver Price Today: దేశంలో వెండి ధరలు వరుసగా రెండోరోజు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,03,000 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement