దేశంలో రెండు రోజులుగా ఎగిసిన బంగారం ధరలు గురువారం (జూలై 18) కాస్త దిగొచ్చాయి. ఈరోజు పసిడి రేట్లలో స్వల్ప తగ్గుదల కనిపించింది. భారీగా పెరిగిన ధరలు కొంత మేర దిగిరావడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని , విశాఖపట్నం, విజయవాడ, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం (10 గ్రాములు ) ధర స్వల్పంగా రూ.160 తగ్గింది. ఫలితంగా రూ. 74,840 లకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం కూడా రూ.150 క్షీణించి రూ.68,600 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,750 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.75,150 వద్దకు దిగొచ్చాయి. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.150 క్షీణించి రూ.69,050 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.75,330 లకు దిగిచ్చింది.
వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా నేడు వెండి రేటు భారీగా క్షీణించింది. హైదరాబాద్లో వెండి ధర కేజీకి రూ.1300 చొప్పున తగ్గి రూ.1 లక్ష దిగువకు వచ్చేసింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.99,200 లుగా ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment