గోల్డ్‌ హ్యాట్రిక్‌.. వరుసగా మూడో రోజూ కరిగిన బంగారం! | Gold and Silver Price Today 19 September 2024 | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ హ్యాట్రిక్‌.. వరుసగా మూడో రోజూ కరిగిన బంగారం!

Published Thu, Sep 19 2024 12:57 PM | Last Updated on Thu, Sep 19 2024 1:11 PM

Gold and Silver Price Today 19 September 2024

దేశంలో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ క్షీణించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్‌ 19) పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. మూడు రోజుల్లో మొత్తంగా రూ.600 మేర పుత్తడి ధరలలో తగ్గుదల నమోదైంది. మరోవైపు యూఎస్‌ ఫెడ్‌ రేట్ల కోత ప్రకటన తర్వాత అంతర్జాతీయంగా బంగారం ధరలు రికార్డ్‌ స్థాయిలో దూసుకెళ్లాయి. అయితే ఇక్కడ దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు ఎంత మేర తగ్గాయన్నది చూస్తే.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.68,250 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.280 కరిగి  రూ. 74,450 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల పసిడి ధర రూ.280 క్షీణించి రూ.74,600 వద్ద​కు దిగివచ్చింది.

ఇదీ చదవండి: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడి

వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు నిలకడగా కొనసాగుతన్నాయి. హైదరాబాద్‌లో నిన్నటి రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి ధర ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.96,000 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement