పసిడి ప్రియుల ఆనందం కొనసాగుతోంది. దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. శనివారం (జూలై 20) పసిడి రేట్లు మోస్తరుగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ తగ్గిన ధరలు కొనుగోలుదారులను నగల దుకాణాల వైపు నడిపిస్తున్నాయి.
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.380 తగ్గి రూ. 73,970 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ.350 తరిగి రూ.67,800 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరల్లో ఇదే స్థాయిలో మూడో రోజూ తరుగుదల
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.350 తగ్గి రూ.67,950 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.74,120 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.350 తగ్గి రూ.68,400 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.74,620 వద్దకు వచ్చింది.
వెండి ధరలు స్వల్పంగా..
దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర కేజీకి రూ.100 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీకి రూ.97,650 లకు దిగివచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment