దేశంలో బంగారం ధరలు ఒక రోజు విరామం తర్వాత ఈరోజు (జూలై 22) స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా ఐదు రోజులుగా పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తూ వస్తున్నాయి. ఈ ఐదు రోజుల్లో బంగారం రేటు సుమారు రూ.1,150 మేర తగ్గింది.
హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.120 తగ్గి రూ. 73,850 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ.100 తరిగి రూ.67,700 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.100 తగ్గి రూ.67,850 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.120 తగ్గి రూ.74,000 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.68,250 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.120 తగ్గి రూ.74,450 వద్దకు వచ్చింది.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా ఈరోజు కూడా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. క్రితం రోజు లాగే వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.96,000 వద్ద నిలకడగా ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment