బంగారం ధరల్లో వరుస తగ్గింపులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం (జూలై 23) పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. వారం రోజులుగా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి. దాదాపు రూ.1,400 మేర దిగివచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.270 తగ్గి రూ. 73,580 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం సైతం రూ.170 తరిగి రూ.67,450 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 తగ్గి రూ.67,600 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,730 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం స్వల్పంగా రూ.150 తగ్గి రూ.68,100 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.74,290 వద్దకు వచ్చింది.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరల్లో కూడా తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో నేడు వెండి రేటు కేజీకి రూ.400 తగ్గింది. దీంతో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.95,600 వద్దకు దిగొచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment