దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరొక్కసారి భారీగా దిగివచ్చాయి. గురువారం (జూలై 25) పసిడి ధరలు 10 గ్రాములకు రూ.1000కిపైగా క్షీణించాయి. బడ్జెట్ ప్రకటన తరువాత రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధరలు మరుసటి రోజు నిలకడగా కొనసాగి నేడు మళ్లీ భారీగా తగ్గి రికార్డ్ మార్కుల దిగువకు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పుత్తడి తులం (10 గ్రాములు ) రూ.950 తగ్గి రూ.64,000 వద్దకు వచ్చేసింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1040 తరిగి రూ. 69,820 వద్దకు దిగివచ్చింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇదే విధంగా ధరలు క్షీణించాయి.
ఇతర నగరాల్లో..
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.950 తగ్గి రూ.64,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.1060 తగ్గి రూ.69,950 వద్ద కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.64,300 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.650 తగ్గి రూ.70,150 వద్దకు వచ్చింది.
రూ.90 వేల దిగువకు వెండి
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు భారీ స్థాయిలో తగ్గాయి. క్రితం రోజున కేజీకి రూ.500 క్షీణించిన వెండి ధర నేడు రూ.3000 మేర తరిగింది. రూ.90 వేల దిగువకు వచ్చేసింది. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్దకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment