Gold Price Today: దేశలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు నేడు (అక్టోబర్ 25) స్వల్పంగా పెరిగాయి. క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇవ్వడంతో ఆనందించిన కొనుగోలుదారులకు మళ్లీ నిరాశ తప్పలేదు.
ఎంత పెరిగిందంటే..
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.100 పెరిగి రూ.72,950 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 బలపడి రూ. 79,580 వద్దకు చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదేవిధంగా ధరలు స్వల్పంగా పెరిగాయి.
ఇదీ చదవండి: ఎఫ్&వో ట్రేడింగ్ అంటే టైమ్‌పాస్ కాదు..
ఇక ఢిల్లిలో కూడా ఈరోజు బంగారం ధరలు కాస్తంత పెరుగుదలను నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.73,100 వద్దకు చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 పెరిగి రూ.79,730 వద్దకు చేరింది.
భారీగా క్షీణించిన వెండి
Silver Price Today: దేశంలో వెండి ధరలు నేడు వరుసగా రెండోరోజూ భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.3000 క్షీణించింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.1,07,000 వద్దకు దిగొచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment