పండుగ ముందు.. పసిడి శుభవార్త! | Gold and Silver Price Today On 28th October 2024 | Sakshi
Sakshi News home page

పండుగ ముందు.. పసిడి శుభవార్త!

Published Mon, Oct 28 2024 12:09 PM | Last Updated on Mon, Oct 28 2024 12:18 PM

Gold and Silver Price Today On 28th October 2024

Gold Price Today: ధన త్రయోదశి, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పసిడి ధరలు  నేడు (అక్టోబర్‌ 28) దిగివచ్చాయి. మూడు రోజుల తర్వాత బంగారం రేట్లు తగ్గడంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది.

తగ్గింపు ఎంత?
తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.450 దిగివచ్చి రూ.73,150 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.490 తగ్గి రూ. 80,290 వద్దకు వచ్చింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇదే స్థాయిలో ధరలు తగ్గింపును నమోదు చేశాయి.

ఇదీ చదవండి: బంగారాన్ని మించి.. దడ పుట్టిస్తున్న వెండి

ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఈరోజు బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.490 క్షీణించింది. ప్రస్తుతం వీటి ధరలు వరుసగా 
రూ.73,300, రూ.79,950 వద్దకు వచ్చి చేరాయి.

Silver Price Today: దేశంలో వెండి ధరలు సోమవారం నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు వరుసగా మూడు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement