ఇదే మంచి తరుణం! పండుగ వేళ పసిడిపై భారీ శుభవార్త | Gold and Silver Price Today On 9 October 2024 | Sakshi
Sakshi News home page

ఇదే మంచి తరుణం! పండుగ వేళ పసిడిపై భారీ శుభవార్త

Published Wed, Oct 9 2024 3:35 PM | Last Updated on Wed, Oct 9 2024 4:01 PM

Gold and Silver Price Today On 9 October 2024

Gold Price Today: దసరా నవరాత్రలు, దీపావళి పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ శుభవార్త. దేశంలో పసిడి, వెండి ధరలు ఈరోజు (అక్టోబర్‌ 9) భారీగా తగ్గాయి. నిన్నటి రోజున నిలకడగా అంతకుక్రితం రోజున స్వల్పంగా తగ్గిన బంగారం నేడు గణనీయంగా దిగొచ్చింది.

తెలుగు రాష్ట్రాలో తగ్గిందెంత?
హైదరాబాద్‌ , విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.700 తగ్గి రూ.70,300 వద్దకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.760 మేర క్షీణించి రూ. 76,690 వద్దకు తరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇదే స్థాయిలో ధరలు క్షీణించాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.700 చొప్పున తగ్గి రూ.70,450 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం రూ.760 మేర కరిగి రూ.76,840 దగ్గరకు దిగివచ్చింది.

రూ.లక్షకు వెండి
Silver Price Today: దేశంలో నేడు వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. క్రితం రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి అదే ఊపుతో ఈరోజు ఏకంగా రూ.2000 తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1 లక్షకు పరిమితమైంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement