Gold Price Today: దేశంలో బంగారం ధరల్లో నేడు (నవంబర్ 16) స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజున ఎంత మొత్తం పెరిగిందో ఈరోజు అంతే మొత్తంలో దిగివచ్చింది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర స్వల్పంగా రూ.100 తగ్గి రూ.69,350 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ. 75,650 వద్దకు క్షీణించింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే విధంగా తగ్గుదల నమోదైంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.69,500 వద్దకు రాగా, 24 క్యారెట్ల పసిడి రూ.110 క్షీణించి రూ.75,800 వద్దకు తగ్గింది.
ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు వరుసగా రెండో రోజూ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment