వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే.. | gold and silver rates today on market in telugu states | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..

Published Tue, Nov 19 2024 12:43 PM | Last Updated on Tue, Nov 19 2024 1:17 PM

gold and silver rates today on market in telugu states

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,650 (22 క్యారెట్స్), రూ.77,070 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.

చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.760, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,070 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.700 పెరిగి రూ.70,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.760 పెరిగి రూ.77,220 వద్దకు చేరింది.

ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్‌

సిల్వర్ ధరలు

బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా మంగళవారం భారీగానే పెరిగాయి. సోమవారంతో పోలిస్తే ఈరోజు కేజీకి రూ.2,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,01,000 వద్ద నిలిచింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement